అతని వదులుకున్నందుకు.. ఇంకా బాధపడుతున్నాం : చెన్నై కోచ్

praveen
ఇటీవలే ఐపిఎల్ లో భాగంగా  చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సొంత మైదానంలో ఓడిపోయింది అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ మ్యాచ్ లో సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి ఇద్దరు కూడా తమ స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశారు. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి అయితే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ లకు చుక్కలు చూపించాడు అని చెప్పాలి. తన స్పిన్ మాయాజాలంతో అదరగొట్టాడు. నాలుగు ఓవర్ల కోటాలో 36 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు పడగొట్టాడు.

 అయితే ఇక ఈ మ్యాచ్ లో ఓటమి అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా వ్యవహరిస్తున్న స్టీఫెన్ ఫ్లెమింగ్ వరుణ్ చక్రవర్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతన్ని వదులుకున్నందుకు ఇప్పటికీ బాధపడుతున్నాం అంటూ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్గా ఉన్నప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెట్టేవాడు అంటూ గుర్తు చేసుకున్నాడు ఫ్లెమింగ్.  వరుణ్ గురించి మాట్లాడుతూ.. వరుణ్ చక్రవర్తిని వదులుకున్నందుకు ఇప్పటికి బాధపడుతూనే ఉన్నాం. నెట్స్ లో మమ్మల్ని అతను ఎంతగానో టార్చర్ పెట్టేవాడు. అతడు ఒక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్.

 అయితే దురదృష్టవశాత్తు మేము అతన్ని సొంతం చేసుకోలేకపోయాం. గత ఏడాది జరిగిన వేలంలో వరుణ్ చక్రవర్తిని దక్కించుకునేందుకు చాలానే ప్రయత్నించాం. కానీ మళ్ళీ  కోల్కతా జట్టు భారీ ధరకు సొంతం చేసుకుంది. చపాక్ లాంటి స్పిన్ పిచ్ లపై వరుణ్ చక్రవర్తి అద్భుతంగా రాణించగలడు. ఇటీవల  మ్యాచ్లో కూడా చక్రవర్తి బాగా బౌలింగ్ చేసాడు అంటూ చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ వ్యాఖ్యానించాడు. ఇకపోతే ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 15 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: