ఐపీఎల్ ఫైనల్.. బెస్ట్ ఆఫ్ త్రీ అయితే బెటర్ : రికీ పాంటింగ్

praveen
బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ టి20 లీగ్ గా కొనసాగుతూ ఉంది. ఒకరకంగా అంతర్జాతీయ క్రికెట్ లో టి20 ఫార్మాట్ కి ఊహించనీ రీతిలో పాపులారిటీ వచ్చింది అంటే అందుకు ఐపీఎల్ కారణం అని చెప్పాలి. అలాంటి ఐపీఎల్ ప్రస్తుతం ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ లీగ్ గా కొనసాగుతుంది. ఎంతో మంది క్రికెటర్ల ఆర్థిక సమస్యలు తీర్చడమే కాదు అనుభవాన్ని.. పేరు ప్రఖ్యాతలను కూడా అందిస్తుంది అని చెప్పాలి. అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఎంతో మంది క్రికెటర్లు ఐపీఎల్ లో రాణించి మళ్లీ టీం లో ఛాన్స్ దక్కించుకోవడం చాలాసార్లు చూశాం.

 అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టాలని ఆశతో ఉన్న యువ క్రికెటర్లకు.. కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఒక మంచి వేదికగా మారిపోయింది. ఇక 2023 ఐపీఎల్ సీజన్ కూడా ప్రతి ఏడాది లాగానే ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులు అందరికీ అసలు సిసలైన  క్రికెట్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఇక లీగ్ మ్యాచ్లు చివరి దశకు చేరుకున్నాయి. ఇక మరికొన్ని రోజుల్లో అటు ప్లే ఆఫ్ కి క్వాలిఫై అవ్వబోయే జట్లు ఏవి అన్న విషయంపై ఒక క్లారిటీ రానుంది. ఈ క్రమంలోనే ప్లే ఆఫ్ కి వెళ్ళబోయే జట్లు ఏవి.. ఇక ఫైనల్లో అడుగుపెట్టబోయే టీమ్స్ ఏవి అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్ లాంటి టి20 టోర్నమెంట్లలో బెస్ట్ ఆఫ్ త్రీ ఫైనల్ ఉండాలని రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. టి20 టోర్నీలో ఉత్తమ జట్టుకు సరైన అవకాశం ఉండాలి. బెస్ట్ ఆఫ్ త్రీ అనేది ఉత్తమం అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అటు వరల్డ్ కప్ లలో మాత్రం సింగిల్ ఫైనల్ నిర్వహించడమే బాగుంటుంది అంటూ అభిప్రాయపడ్డాడు రికీ పాంటింగ్. ఇకపోతే రికీ పాంటింగ్ కోచ్ గా వ్యవహరిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్.. ఈ ఏడాది ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన మొదటి జట్టుగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: