పాపం.. రోహిత్ రికార్డును సమం చేసిన డీకే?

praveen
2023 ఐపీఎల్ సీజన్ ప్రేక్షకులందరికీ అసలు సిసలైన  క్రికెట్ ఎంటర్టైన్మెంట్ పంచింది. అంచనాలకు మించి ఇక ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా సాగింది. ఒకప్పుడు హోమ్ గ్రౌండ్ లో ఆడిన ప్రతి టీం కూడా గెలుస్తుంది అనే భావన  ఉండేది. కానీ ఇటీవల కాలంలో హోం గ్రౌండ్లో ఆడిన జట్లు సైతం వరుసగా ఓటమిలు చవిచూడటంతో ఏ మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుంది అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి.

 అదే సమయంలో ఆటగాళ్ల ప్రదర్శన విషయంలో సైతం ఇక ఇలాంటి కన్ఫ్యూజన్లోనే మునిగిపోయారు అభిమానులు. అద్భుతంగా రానించి అదరగొడతారు అనుకున్న కొంతమంది ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో నిరాశ పరుస్తే.. అంచనాలు లేని ఆటగాళ్లు  మాత్రం అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. ఇక అటు దినేష్ కార్తీక్ విషయంలో కూడా ఇదే జరిగింది. గత ఏడాది ఐపీఎల్ సీజన్లో దినేష్ కార్తీక్ బ్యాటింగ్తో సృష్టించిన విధ్వంసం ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదు.

 కెరీర్ ముగిసిపోతుంది అనుకుంటున్న సమయంలో తన మెరుపు బ్యాటింగ్తో సెలెక్టర్లను ఆకట్టుకున్న దినేష్ కార్తీక్.. ఇక భారత జట్టులోకి వచ్చాడు. కానీ ఆ తర్వాత మెరుపులు మెరూపించలేకపోయాడు. అయితే ఇప్పుడు 2023 ఐపీఎల్ సీజన్లోనూ ఇక దినేష్ కార్తీక్ వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును సమం చేశాడు. ఐపిఎల్ హిస్టరీలో అత్యధిక సార్లు డక్ అవుట్ అయిన బ్యాట్స్మెన్ గా రోహిత్ సరసన దినేష్ కార్తీక్ నిలిచాడు. ఇప్పటివరకు ఈ ఇద్దరు కూడా 16 సార్లు డకౌట్ అయ్యారు అని చెప్పాలి. అయితే దినేష్ కార్తీక్ ఆట తీరుపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నీకు క్రికెట్ ఎందుకు వెళ్లి కామెంట్రీ చెప్పుకో అంటూ ఘాటుగా కామెంట్లు చేస్తూ ఉండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: