సూర్య ఆ షాట్ ఎలా కొట్టాడు.. సచిన్ ఆశ్చర్యం?

praveen
టి20 ఫార్మాట్లో టీమ్ ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్ ఎంతటి విధ్వంసకరమైన బ్యాట్స్మెన్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే అటు ఐపీఎల్ ప్రారంభం సమయంలో మాత్రం కొన్ని లీగ్ మ్యాచ్ లలో తెగ ఇబ్బంది పడిపోయాడు సూర్య కుమార్ యాదవ్. సూర్య ఏంటి ఇలా ఆడుతున్నాడు అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. అయితే ఆ తర్వాత మాత్రం అద్భుతంగా పుంజుకున్న సూర్యకుమార్ మరోసారి ప్రత్యర్థి బౌలర్ల పై పూనకం వచ్చినట్లుగానే ఊగిపోతున్నాడు. మిస్టర్ 360 ప్లేయర్ అంటూ తాను సంపాదించుకున్న బిరుదును సార్ధకం చేస్తూ ప్రతి మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు.

 మైదాన నలువైపులా ఎంతో అలవోకగా సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతూ బౌలర్ల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇక అతని బ్యాటింగ్లో అద్భుతమైన షాట్లు చూసి పెద్ద పెద్ద క్రికెటర్లు సీనియర్లు సైతం ఆశ్చర్యపోతున్నారు అనడంలో సందేహం లేదు. ఇక ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ఏకంగా 27 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది ముంబై ఇండియన్స్ జట్టు. ఇక ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్ అయితే అద్భుతం  అనడంలో సందేహం లేదు. 49 బంతుల్లోనే 103 పరుగులు చేసి అదరగొట్టాడు. ఈ మిస్టర్ 360 ప్లేయర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

 అయితే ఇక ఇన్నింగ్స్ లో సూర్య కుమార్ యాదవ్ ఆడిన కొన్ని షాట్లు అయితే అందరిని ఆశ్చర్యపరిచాయి. అయితే ముంబై ఇండియన్స్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో అటు డగ్ అవుట్ లో ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించిన సచిన్ టెండుల్కర్ సూర్య కొట్టిన షాట్లు చూసి షాక్ అయ్యాడు. షమీ బౌలింగ్లో స్కై కొట్టిన షాట్ చూసి సచిన్ అసలు ఎలా సాధ్యమైంది అంటూ కామెంట్ చేశాడు. తాను ఇప్పటివరకు ఇలాంటి షాట్స్ చూడలేదని.. సూర్యకుమార్ను పొగడ్తల్లో ముంచేసాడు మాస్టర్ బ్లాస్టర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: