ఐపీఎల్ లో నిరాశపరిచాడు.. క్రికెట్ బోర్డు పక్కన పెట్టింది?

praveen
బీసీసీఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లు తక్కువ సమయం లోనే అంతర్జాతీయ క్రికెట్ లో కనిపించడం చూస్తూ ఉంటాం. ఈ క్రమం లోని ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ ఇలా ఐపీఎల్లో సత్తా చాటి ఇక తమ దేశం తరఫున ఆడాలని ఆశపడుతూ ఉంటారు. ఇక మరోవైపు సీనియర్ ప్లేయర్స్ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతూ జట్టుకు దూరమైన వారు ఐపీఎల్లో రానించి మళ్లీ జట్టు లో చోటు సంపాదించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు.

 ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా ఇలా ఐపీఎల్లో రాణించిన ప్లేయర్లకే జట్టు లోకి ఎంపిక చేయడం విషయం లో పెద్దపీట వేస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల వెస్టిండీస్ క్రికెట్ బోర్డు కూడా ఇలాగే వ్యవహరించింది. ప్రస్తుతం ఐపీఎల్ లో అదరగొడుతాడు అనుకుంటే.. పేలవా ఇన్నింగ్స్ లు ఆడుతున్న పవర్ హిట్టర్ ని ఇక జట్టులోకి తీసుకోకుండా పక్కన పెట్టేసింది. పవర్ హిట్టర్లకు కేరాఫ్ అడ్రస్ గా పేరు సంపాదించుకున్న వెస్టిండీస్ జట్టు ఇక 2023 వన్డే వరల్డ్ కప్ లో అర్హత సాధించేందుకు ప్రస్తుతం క్వాలిఫైయర్ మ్యాచ్లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇటీవలే క్వాలిఫైయర్ మ్యాచ్ల కోసం వెస్టిండీస్ క్రికెట్ బోర్డు జట్టు వివరాలను ప్రకటించింది. ఈ క్రమంలోని ఇక జట్టు కెప్టెన్ గా శై హోప్, వైస్ కెప్టెన్ గా రోమన్ పావెల్ వ్యవహరించబోతున్నట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అంతా బాగానే ఉంది కానీ జట్టులో కీలక ప్లేయర్గా కొనసాగుతున్న షిమ్రాన్ హెట్మేయర్ ను మాత్రం పక్కన పెట్టేసింది ఆ జట్టు యాజమాన్యం. కాగా షిమ్రాన్ హెట్మేయర్ ప్రస్తుతం ఐపిఎల్ లో వరుసగా విఫలం అవుతున్నాడు. అవకాశాలు ఇచ్చిన ఉపయోగించుకోవట్లేదు. దీంతో అతన్ని  వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పట్టించుకోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: