వరల్డ్ కప్ కోసం.. ఆ ఇద్దరినీ సిద్ధం చేయండి : రవి శాస్త్రి

praveen
సాధారణంగా ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్ లో ఎంతో మంది యువ ఆటగాళ్లు తమ ప్రతిభను నిరూపించుకుని ఇక తెరమీదకి వస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఐపీఎల్ స్టార్లుగా మారిపోతూ ఉంటారు. ఇక ఈ ఏడాది కూడా ఇలాగే ఇద్దరు యంగ్ ప్లేయర్స్ తమ టాలెంట్ తో అందరిని ఆశ్చర్యపరిచారు. అందులో ఒకరు యశస్వి జైష్వాల్. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యశస్వి జైష్వాల్ తన బ్యాటింగ్తో సృష్టిస్తున్న విధ్వంసం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. చూడ్డానికి ఎంతో బక్క పల్చగా కనిపించే ఈ ప్లేయర్ కొడుతున్న సిక్సర్లు చూసి అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి.

 ప్రతి మ్యాచ్ లో కూడా రాజస్థాన్ రాయల్స్ తరఫున ఓపెనర్ గా బరులోకి దిగుతూ.. భారీ స్కోర్లు చేస్తూ ఉన్నాడు యశస్వి జైస్వాల్. దేశవాళి క్రికెట్లో లాగానే ఐపీఎల్లో సైతం తన బ్యాటింగ్ విధ్వంసాన్ని కొనసాగిస్తున్నాడు. ఇక మరోవైపు రింకు సింగ్ కూడా 2023 ఐపీఎల్ హీరోగా మారిపోయాడు. ఏకంగా ఒక మ్యాచ్ లో చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు కొట్టి జట్టును గెలిపించి అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు. ఇక ప్రతి మ్యాచ్లో కూడా ఐదవ స్థానంలో బ్యాటింగ్ దిగుతూ మంచి ఫినిషిర్ పాత్రను పోషిస్తున్నాడు అని చెప్పాలి. ఇక వీరిద్దరూ టీమిండియా ఫ్యూచర్ స్టార్లు గానే కనిపిస్తున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీం ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2023 ఐపీఎల్ లో అదరగొడుతున్న యశస్వి జైస్వాల్, రింకు సింగ్ లను భారత జట్టుకు ఎంపిక చేయాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడిన ఆయన.. సెలక్టర్లు వన్డే వరల్డ్ కప్ పై ఫోకస్ పెట్టినట్లయితే.. యశస్వి జైష్వాల్ రింకు సింగ్ లాంటి ఆటగాళ్లను సిద్ధం చేయాలి. యువ ఆటగాలకు ఎక్కువగా అవకాశం ఇవ్వాలి. వచ్చే ఏడాది న్యూజిలాండ్ వేదికగా జరగబోయే టి20 వరల్డ్ కప్ కోసం ఈ యాంగ్ ప్లేయర్స్ ని ఇప్పటినుంచి సిద్ధం చేయాలి అంటూ రవి శాస్త్రి సూచించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: