వైరల్ : పబ్ లో ధోని.. ఎంతో హుషారుగా డాన్స్?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా భారతదేశం గర్వించదగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే ఏకంగా భారత జట్టు సారధ్య బాధ్యతలను కూడా అందుకున్నాడు. అంతేకాదు ఇక భారత క్రికెట్ హిస్టరీలో తన నైపుణ్యంతో గ్రేటెస్ట్ కెప్టెన్ గా కూడా అవతరించాడు. టీమిండియా కు అందని ద్రాక్షలా ఉన్నవరల్డ్ కప్ ను రెండు సార్లు అందించి తన కెప్టెన్సీ సత్తా ఏంటో నిరూపించాడు.

 ఇప్పటికి ధోని రికార్డును ఎవరు బ్రేక్ చేయలేకపోయారు అని చెప్పాలి. అంతేకాకుండా ఇక అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ వికెట్ కీపర్ గా బెస్ట్ ఫినిషిర్ గా కూడా పేరు సంపాదించుకున్నాడు. అయితే మిగతా క్రికెటర్లతో పోల్చి చూస్తే ధోనీకి ప్రత్యేకమైన గుర్తింపు రావడానికి కారణం అతని యాటిట్యూడ్. సాధారణంగా మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరైనా సరే టెన్షన్ పడటం చూస్తూ ఉంటాం. కొన్ని కొన్ని సార్లు ఇక సహచర ఆటగాళ్లపై కూడా కోపం చిరాకు వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ ధోని మాత్రం క్లిష్ట పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు.

 లోలోపల ఆలోచనలు పరుగులు పెడుతున్న.. ఇక తన హావ భావాలను మాత్రం బయటికి ప్రదర్శించడానికి ధోని ఇష్టపడడు. అందుకే సంతోషాన్ని అయినా బాధను అయినా కూడా బయటకి చూపించకుండా ప్రశాంతంగా కనిపిస్తాడు. ఇలాంటి తత్వమే ధోనిని అందరిలో కెల్లా ప్రత్యేకమైన స్థానంలో నిలబెట్టింది. అలాంటి ధోని ఏకంగా పబ్ లో సహచర ఆటగాళ్లతో ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేస్తే ఎలా ఉంటుంది. అయినా ధోని అలాంటివి చేస్తాడు అని అనుకుంటారు అభిమానులు. కానీ ఇటీవల ధోని హార్దిక్ పాండ్యా సహా మరి కొంతమంది టీం ఇండియా ప్లేయర్స్ తో కలిసి పబ్ లో హుషారుగా డాYour browser does not support HTML5 video.న్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.ఇది చూసి ఫీదా అవుతున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: