మ్యాచ్ ఓడినా.. ప్రత్యర్థిని గజగజ వనికించాడు?

praveen
ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమమైన స్పిన్నర్లలో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ కూడా ఒకడు అన్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన తక్కువ సమయంలోనే రషీద్ ఖాన్ తన స్పిన్ బౌలింగ్ తో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. మహా మహా బ్యాట్స్మెన్లను సైతం బోల్తా కొట్టించి వికెట్ దక్కించుకున్నాడు రషీద్ ఖాన్. ఇక ఐపీఎల్ లో కూడా వివిధ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు అని చెప్పాలి.

 గత ఏడాది ఐపిఎల్ సీజన్ నుంచి కూడా గుజరాత్ టైటాన్స్ లో  కొనసాగుతున్నాడు రషీద్ ఖాన్. ఇక ఎప్పటి లాగానే తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ క్రియేట్ చేస్తూ ప్రతి మ్యాచ్ లో కూడా అదరగొడుతూ ఉన్నాడు. అయితే రషీద్ ఖాన్ కొన్ని కొన్ని సార్లు బ్యాట్ తో కూడా సంచలన ఇన్నింగ్స్ లు ఆడటం చేస్తూ ఉంటాము. దీంతో ఇలాంటివి చూసినప్పుడు రషీద్ ఖాన్ ను కేవలం స్పిన్నర్ అనాలా లేకపోతే స్పిన్ ఆల్ రౌండర్ అని పిలవాలా అనే కన్ఫ్యూజన్లో ఉంటారు ప్రేక్షకులు. ఇక ఇటీవల ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లోను రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్ తో అందరిని ఆశ్చర్యపరిచాడు.

 అయితే ఇటీవలే గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై విజయం సాధించింది. కానీ గుజరాత్ బ్యాట్స్మెన్ రషీద్ ఖాన్ మాత్రం అటు ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. గుజరాత్ ఓటమి ఖాయం అనుకున్న సమయంలో ఒక్కసారిగా అందరిలో విజయం పై ఆశలు రేకెత్తేలా చేశాడు. 32 బంతుల్లోనే 79 పరుగులు చేసి సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. ఇలా ముంబై బౌలర్లకు దడ పుట్టించాడు అని చెప్పాలి. ఇక రషీద్ ఖాన్ ఇన్నింగ్స్ లో పది సిక్సర్లు మూడు ఫోర్లు ఉన్నాయి. కార్తికేయ వేసిన చివరి ఓవర్ లో మూడు సిక్సర్లు కొట్టాడు. అయితే ఇలా చివరి వరకుపోరాడిన  అతనికి మిగతా బ్యాట్స్మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో గుజరాత్ ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: