ఐపీఎల్ లో.. ఢిల్లీ, కోల్కతా టీమ్స్ చెత్త రికార్డు?

praveen
2023 ఐపీఎల్ సీజన్లో పడుతూ లేస్తూ ప్రయాణాన్ని కొనసాగించాయి ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు. మరీ ముఖ్యంగా ఢిల్లీ అయితే దారుణమైన ప్రదర్శన చేసి అభిమానులందరినీ కూడా నిరాశలో ముంచేస్తుంది. వరుసగా పరాజయాలు చవిచూసింది. ప్రత్యర్థికి కనీస పోటీ ఇవ్వలేక తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది అని చెప్పాలి. అంతేకాదు ఇక ఇటీవలే ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఘోర ఓటమి చవిచూడటం ద్వారా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయిన మొదటి జట్టుగా కూడా ఢిల్లీ క్యాపిటల్స్ చెత్త రికార్డును మూటగట్టుకుంది అని చెప్పాలి.

 అయితే ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ కూడా ఢిల్లీ జట్టు రీతిలోనే దారుణమైన ఓటమి చవి చూసింది. ఏకంగా 47 బంతులు మిగిలి ఉండగానే ఓడిపోయింది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు. అయితే ఈ ఓటమితో అటు కోల్కతా జట్టు కూడా ఐపీఎల్ లో ప్లే ఆఫ్ అవకాశాలను కోల్పోయింది అని చెప్పాలి. ఇలా ఈ ఏడాది ఐపిఎల్ సీజన్లో ప్లే ఆఫ్ రేస్ నుంచి తప్పుకున్న మొదటి రెండు జట్లుగా ఢిల్లీ,  కోల్కతా చెత్త రికార్డును మూటగట్టుకున్నాయి. అదే సమయంలో మరో చెత్త రికార్డు కూడా ఈ రెండు జట్ల ఖాతాలో చేరిపోయింది.

 2023 ఐపీఎల్ సీజన్లో పవర్ ప్లే లో ఎక్కువ వికెట్లు కోల్పోయిన టీమ్స్ గా కోల్కతా నైట్ రైడర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిలిచాయి. ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లలో పవర్ ప్లే లో ఓవర్లలోనే 25 వికెట్లను కోల్పోయాయి అని చెప్పాలి. ఇప్పుడు వరకు ఏ టీం కూడా పవర్ ప్లే లో ఈ రేంజ్ లో వికెట్లు కోల్పోలేదు. దీంతో పవర్ ప్లే లో అత్యధిక వికెట్లు కోల్పోయిన టీమ్స్ గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాయి. అయితే ఈ రెండు జట్ల తర్వాత పంజాబ్ కింగ్స్ జట్టు 21 వికెట్లు  కోల్పోయి  తర్వాత స్థానంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: