తండ్రి కాబోతున్న స్టార్ క్రికెటర్.. ఫాన్స్ ఫుల్ హ్యాపీ?

praveen
సాధారణంగా సినీ సెలబ్రిటీలతో పోల్చి చూస్తే అటు క్రికెటర్లకు సోషల్ మీడియాలో కాస్త ఎక్కువగానే క్రేజ్ ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఎందుకంటే సినీ సెలెబ్రెటీలు కేవలం ఒకే ప్రాంతంలో గుర్తింపును సంపాదించుకుంటారు. కానీ అంతర్జాతీయ క్రికెట్ లోకి వచ్చే క్రికెటర్లు ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానులను సంపాదించుకుంటారు. ఈ క్రమంలోనే క్రికెటర్లు ఏ చిన్న పోస్ట్ పెట్టినా కూడా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఇక ఇలాంటి ఒక గుడ్ న్యూస్ కాస్త ఒక స్టార్ క్రికెటర్ అభిమానులందరినీ కూడా ఆనందంలో ముంచేస్తుంది.

 ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ మాక్స్వెల్ తన ఆట తీరత ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. అటు ఐపిఎల్ లో కూడా పలు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ప్రస్తుతం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు తరఫున ఆడుతూ తన విధ్వంసకరమైన ఆటతీరుతో ప్రేక్షకులను ఫిదా చేస్తున్నాడు అని చెప్పాలి. దీంతో ఎన్నో రికార్డులు కొల్లగోడుతున్నాడు. ఇలా మంచి ఫామ్ లో మంచి ప్రదర్శన కనబరుస్తున్న మాక్స్వెల్ ఇటీవల అభిమానులకు ఒక గుడ్ న్యూస్ చెప్పాడు. అయితే అది క్రికెట్ గురించి కాదు.. తన పర్సనల్ లైఫ్ గురించి. తాను తండ్రిని కాబోతున్నాను అంటూ శుభవార్త చెప్పాడు మాక్స్వెల్.

ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ఇండియాకు చెందిన విని రామన్ ను పెళ్లి చేసుకున్నాడు. 2022లో వీరి వివాహం జరిగింది. హిందూ క్రిస్టియన్ సాంప్రదాయాల ప్రకారం ఇక వీరిద్దరూ కూడా వివాహ బంధంలోకి అడుగు పెట్టారు అని చెప్పాలి. ఇలా ఆస్ట్రేలియా క్రికెటర్ ఇండియా అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అప్పట్లో వార్తల్లో హార్ట్ టాపిక్ గా మారిపోయింది. అయితే తన భార్య విని రామన్ ప్రస్తుతం ప్రెగ్నెంట్  అని మ్యాక్స్ వెల్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ ఏడాది సెప్టెంబర్ లో తన భార్య బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపాడు. దీంతో ఫాన్స్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: