టెన్షన్ పడకండి.. అతను వరల్డ్ కప్ ఆడుతాడు : కివిస్ బోర్డు

praveen
ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా ఈ ఏడాది జరగబోయే వన్డే వరల్డ్ కప్ కోసం ఎదురుచూస్తూ ఉన్నారు. అయితే కేవలం క్రికెట్ ప్రేక్షకులు మాత్రమే కాదు ఆయా దేశాల క్రికెట్ బోర్డులు కూడా వన్డే వరల్డ్ కప్ కోసం అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది జరగబోయే ఈ మెగా టోర్నీకి అటు ఇండియా ఆతిథ్యం ఇస్తూ ఉండడం గమనార్హం. అదే సమయంలో టీమిండియా ఇక టైటిల్ ఫేవరెట్ గా కూడా బరిలోకి దిగుతుంది. అయితే ఇక వరల్డ్ కప్ కోసం పటిష్టమైన జట్టును ఎంపిక చేయడమే లక్ష్యంగా ఆయా క్రికెట్ బోర్డులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉన్నాయి.

 ఇలాంటి సమయంలో ఇక ఆయా జట్లలో కీలక ప్లేయర్లుగా కొనసాగుతున్న వారు గాయం బారిన పడి జట్టుకు దూరమవుతూ ఉండడం లాంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక న్యూజిలాండ్ జట్టులో కీలక బౌలర్గా ఉన్న ట్రెంట్ బౌల్ట్ కూడా అసలు వరల్డ్ కప్ లో ఆడుతాడా లేదా అన్నది మాత్రం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే ఇక ఈ అనుమానం రావడానికి కారణం అతనికి గాయం కావడం కాదు..  ఏకంగా అతను సెంట్రల్ కాంట్రాక్టును తిరస్కరించడమే.

 గత ఏడాది ట్రెంట్ బౌల్ట్  అటు కివీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టు ను తిరస్కరించడం ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీంతో ఇక న్యూజిలాండ్ తరఫున అతను వరల్డ్ కప్ ఆడుతాడా లేదా అనే విషయంపై సందిగ్ధత  నెలకొంది. అయితే ఇటీవల ఇదే విషయంపై కివీస్ క్రికెట్ బోర్డు క్లారిటీ ఇచ్చింది. ట్రెంట్ బౌల్ట్  ఈ ఏడాది భారత్లో జరగనున్న వన్డే వరల్డ్ కప్ ఆడతాడని.. ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ విషయాన్ని జట్టు సీఈవో ధ్రువీకరించారు. కాగా న్యూజిలాండ్ తరఫున చివరిసారి 2022 వరల్డ్ కప్ లో ఆడాడు ట్రెంట్ బౌల్ట్. అప్పటి నుంచి ఇక జట్టులోకి వెళ్లలేదు. ఇప్పుడు ఐపీఎల్ లో రాజస్థాన్ తరపున ప్రాతినిధ్యం  వహిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: