ఆయనే నా మార్గదర్శకుడు.. జీవితాంతం రుణపడి ఉంటా : కోహ్లీ

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో ఉన్న అత్యుత్తమ క్రికెటర్ల గురించి చర్చ వచ్చిందంటే చాలు టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ పేరే మొదట వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచ క్రికెట్లో ఇప్పటివరకు ఆ రేంజ్ లో తన హవాని నడిపించాడు కోహ్లీ. ఎంతో మంది లెజెండరీ క్రికెటర్స్ సాధించిన రికార్డులను అతి తక్కువ సమయంలోనే బ్రేక్ చేసి తాను ఒక లెజెండ్ అన్న విషయాన్ని నిరూపించుకున్నాడు. ఇక ఫిట్నెస్ విషయంలో కూడా విరాట్ కోహ్లీకి ప్రపంచ క్రికెట్లో ఉన్న ఏ ప్లేయర్ కూడా సాటిరారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక కోహ్లీలో ఉండే దూకుడు ప్రేక్షకులను ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది.

 ఇక విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉండే పాపులారిటీ గురించి అయితే కొత్తగా చెబితే అది అతిశయోక్తి అవుతుంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ క్రేజ్ ను చూస్తే ఏ క్రికెటర్ కూడా అతనికి చేరువలో కూడా లేడు. వాణిజ్య ప్రకటనలు, సోషల్ మీడియాలో పోస్టులు అంటూ ఇక కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు కోహ్లీ. అయితే ఇక ఇంత స్టార్ క్రికెటర్ అయినప్పటికీ తన గురుభక్తిని చాటుకోవడంలో మాత్రం ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఇటీవలే ఢిల్లీ తో మ్యాచ్ సందర్భంగా మైదానంలో తన చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మకు కోహ్లీ పాదాభివందనం చేశాడు. ఇక ఆయన గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘమైన పోస్టు రాసుకొచ్చాడు కోహ్లీ.

 ఇప్పటికి చాలామంది క్రీడలను రెండో ప్రాధాన్యంగానే చూస్తారు. ఇలాంటప్పుడే మనలోని సత్తాను గమనించి తొలి రోజు నుంచే నమ్మకంతో బాసటగా నిలిచే వారిని తప్పక గుర్తు చేసుకోవాలి. ఆ విషయంలో నేను ఎప్పటికీ రాజ్ కుమార్ సర్ కు రుణపడి ఉంటా. కేవలం కోచ్ గాని కాకుండా నా క్రీడా ప్రయాణంలో మార్గదర్శకుడిగా ఆయన కీలకపాత్ర పోషించారు. చిన్నపిల్లాడిలా భారత జెర్సీనీ వేసుకోవాలని కలను నిజం చేసుకోవడంలో మీ సహకారం మాటల్లో చెప్పలేనిది. 15 ఏళ్ల కిందట తొలిసారి భారత జెర్సీని ధరించా.. బ్యాటింగ్కు సంబంధించిన పాఠాలు నేను ఎదుర్కొన్న కష్ట సమయంలోనూ వెన్నంటే ఉండి మద్దతుగా నిలిచారు. నా కలను మీ కలగా భావించి నాకు అండగా నిలిచారు. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా అంటూ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: