ఐపీఎల్ : అతని బ్యాటింగ్ చూసి.. ఫిదా అయిన కోహ్లీ?

praveen
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో దేశవాళి క్రికెట్లో విధ్వంసకర బ్యాట్స్మెన్ గా పేరు సంపాదించుకున్న యశశ్వి జైష్వాల్.. ఐపీఎల్ లో కూడా తన హవా నడిపిస్తున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న యశస్వి జైస్వాల్  తన బ్యాటింగ్ విధ్వంసంతో బౌలర్ల వెన్నుల్లో వణుకు పుట్టిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అతను పేరుకు మాత్రమే యంగ్ ప్లేయర్ కానీ స్టార్ బ్యాట్స్మెన్ లకు సైతం సాధ్యం కాని రీతిలో ప్రదర్శన చేస్తూ అదరగొడుతున్నాడు. అటు ప్రత్యర్థి ఎవరైనా సరే లెక్క చేయకుండా ప్రతి మ్యాచ్ లో కూడా సిక్సర్లు ఫోర్లతో  చెలరేగిపోతూ వీర విహారం చేస్తున్నాడు యశస్వి జైస్వాల్.

 ఇక తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో ఇప్పటికీ ఎన్నో రికార్డులను కొల్లగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఇక ప్రస్తుతం ఐపీఎల్ లో జైస్వాల్ బ్యాటింగ్ చూస్తూ అటు మాజీ క్రికెటర్లే కాదు ప్రస్తుతం టీమిండియాలో ఉన్న స్టార్ క్రికెటర్ల సైతం ఫిదా అయిపోతున్నారు. ఇక అతని బ్యాటింగ్ పై ప్రశంసలు కురిపించకుండా ఉండలేకపోతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల రాజస్థాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో మరోసారి యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ విధ్వంసాన్ని సృష్టించాడు. 47 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. త్రుటిలో సెంచరీ మిస్ అయ్యాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే అద్భుతమైన బ్యాటింగ్తో అదరగొట్టిన యశస్వి జైష్వాల్ పై టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. వావ్ ఇటీవల నేను చూసిన బెస్ట్ బ్యాటింగ్ ఇదే. వాటే టాలెంట్ అని ఇంస్టాగ్రామ్ లో స్టోరీ పెట్టాడు. అయితే ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో కేవలం 13 బంతుల్లోని హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న జైష్వాల్ చరిత్ర సృష్టించాడు. అంతేకాదు 2023 ఐపీఎల్ సీజన్లో 500 కు పైగా పరుగులు చేసిన ఏకైక భారత బ్యాట్స్మెన్ గా కూడా అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఒక రకంగా తన బ్యాటింగ్ తో రాజస్థాన్ జట్టుకు వెన్నుముకగా నిలుస్తున్నాడు జైశ్వాల్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: