ఐపీఎల్ : బక్కపలుచని కుర్రాడు.. బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు?

praveen
ప్రస్తుతం 2023 ఇండియన్ ప్రీమియర్ లీగ్ ని క్రమం తప్పకుండా ఫాలో అవుతున్న ప్రేక్షకులు అందరూ కూడా ఒక ఆటగాడి బ్యాటింగ్ విధ్వంసం గురించి చర్చించుకుంటున్నారు. ఆ ప్లేయర్ ఎవరో కాదు రాజస్థాన్ రాయల్స్ ఓపెన్ యశస్వి జైస్వాల్. ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ యంగ్ క్రికెటర్. అయితే ఇప్పటికే తన సత్తా ఏంటి అన్నది దేశవాళీ క్రికెట్లో నిరూపించుకున్నాడు. ఇక పలు టోర్నీలలో సెంచరీలతో చెలరేగిపోయి విధ్వంసం సృష్టించాడు. అయితే ఐపీఎల్లో కూడా అతని ప్రస్థానం అంతే విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పాలి.

 రాజస్థాన్ ఆడిన ప్రతి మ్యాచ్ లో కూడా యశస్వి జైష్వాల్ ఓపెనర్ గా బరిలోకి దిగుతూ సృష్టిస్తున్న విధ్వంసం అంతా అంతా కాదు. ఒక రకంగా అతను బ్యాటింగ్ చేస్తున్నాడు అంటే చాలు బౌలింగ్ చేయడానికి స్టార్ బౌలర్లు సైతం వనికి పోతున్న పరిస్థితి ప్రస్తుతం ఐపిఎల్ లో కనిపిస్తుంది. సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోతున్న యశస్వి జైస్వాల్  పరుగుల సునామీ సృష్టిస్తున్నాడు అని చెప్పాలి. ఇక ఇటీవల కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో కూడా బ్యాటింగ్లో పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు. 47 బంతుల్లో 98 పరుగులు చేసి తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు.

 అయినప్పటికీ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించాడు అని చెప్పాలి. ఈ సీజన్లో 500 పరుగులు పూర్తి చేసుకున్న తొలి ఇండియన్ బ్యాట్స్మెన్ గా రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలోనే అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు అని చెప్పాలి.  జైష్వాల్ విధ్వంసం కారణంగానే రాజస్థాన్ రాయల్స్ జట్టు 13.2 ఓవర్లలోనే 150 పరుగులు టార్గెట్ ను చేదించి ఘనవిజయాన్ని అందుకుంది. ఇక అతని విధ్వంసకరమైన బ్యాటింగ్ చూసి అభిమానులు అందరూ కూడా ఫిదా అవుతున్నారు. చూడ్డానికి ఏమో బక్క పలుచగా ఉన్నావ్.. కానీ ఈ బ్యాటింగ్ విధ్వంసం ఏంటి గురు అసలు నమ్మలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: