ఒక్క ఇన్నింగ్స్ తో.. జైశ్వాల్ ఎన్ని రికార్డులు కొట్టాడో తెలుసా?

praveen
ఐపీఎల్ పోరు ప్రస్తుతం మరింత రసవతరంగా మారిపోయింది. ప్రస్తుతం లీగ్ మ్యాచ్ లు చివరి దశకు చేరుకున్నాయ్. దీంతో ఇక అన్ని జట్లు పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాలలో నిలవడమే లక్ష్యంగా ప్రతి మ్యాచ్లో బలిలోకి దిగుతున్నాయి.  ఒకరకంగా చెప్పాలంటే డూ ఆర్ డై మ్యాచ్ లు ఆడుతూ ఉన్నాయి అని చెప్పాలి. దీంతో ఇక మ్యాచ్లలో ఉత్కంఠ మరింత క్రికెట్ మజానీ ప్రేక్షకులకు అందిస్తుంది. ఇకపోతే ఇటీవలి రాజస్థాన్ రాయల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది.

 ఈ మ్యాచ్ లో పోరు నువ్వా నేనా అన్నట్లుగా కాదు వార్ వన్ సైడ్ అన్నట్లుగానే సాగింది. ఎందుకంటే రాజస్థాన్ రాయల్స్ జట్టు అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రదర్శన చేసింది. ముఖ్యంగా బ్యాటింగ్లో అసమాన్యమైన ప్రదర్శనతో ఘనవిజయాన్ని అందుకుంది రాజస్థాన్ రాయల్స్ జట్టు.  రాజస్థాన్ ఓపెనర్ యశస్వి జైష్వాల్ బ్యాటింగ్ విధ్వంసం ప్రేక్షకులు అందరిని ఫిదా చేసేసింది. 47 బంతుల్లోనే 98 పరుగులు చేసి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయాడు యశస్వి జైశ్వాల్. ఈ క్రమంలోనే ఈ వీరోచితమైన ఇన్నింగ్స్ కారణంగా ఒకటి కాదు రెండు కాదు చాలానే రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు అని చెప్పాలి.

 యశస్వి జైష్వాల్ కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో 13 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అయితే ఇది ఐపీఎల్ హిస్టరీలోనే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కావడం గమనార్హం. ఇలా అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ నమోదు చేసిన అతిపిన్న వయసుకుడిగా కూడా రికార్డు సృష్టించాడు.

 అంతేకాదు ఐపీఎల్ హిస్టరీలో తొలి ఓవర్ లోనే అత్యధిక పరుగులు (26 ) చేసిన బ్యాట్స్మెన్ గా కూడా రికార్డు సృష్టించాడు యశస్వి జైస్వాల్.

 ఇక 2023 ఐపీఎల్ సీజన్లో 500 ప్లస్ పరుగులు చేసిన ఏకైక టీమిండియా బ్యాట్స్మెన్ గా అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

 మరోవైపు రాజస్థాన్ 47 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించి ఐపీఎల్ హిస్టరీలో రెండవ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇలా ఒక్క సంచలన ఇన్నింగ్స్ తో ఎన్నో రికార్డులను సృష్టించాడు ఈ యంగ్ బ్యాట్స్మెన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: