రోహిత్ లో మానసిక సమస్య ఉంది : సెహ్వాగ్

praveen
2023 ఐపీఎల్ సీజన్లో అటు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ జట్టు మొదటి నుంచి పడుతూ లేస్తూ ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. అయితే ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించడం ద్వారా ఒక్కసారిగా పాయింట్ల పట్టికలో మూడవ స్థానానికి చేరుకుంది అని చెప్పాలి. ఇప్పటివరకు 11 మ్యాచ్లు ఆడిన ముంబై ఇండియన్స్ జట్టు ఆరు విజయాలను సాధించింది. అయితే ముంబై ఇండియన్స్ క్రమక్రమంగా ఇలా పుంజుకుంటూ ఉన్నప్పటికీ ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుతో మాత్రం అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోతున్నారు అని చెప్పాలి.

 ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ మినహా మిగతా మ్యాచ్లలో మాత్రం రోహిత్ శర్మ ఎక్కడ చెప్పుకోదగ్గ బ్యాటింగ్ చేయలేదు. మొత్తంగా 11 మ్యాచ్ లలో కలిపి రోహిత్ శర్మ 17.36 సగటుతో 191 పరుగులు మాత్రమే చేశాడు. పంజాబ్, చెన్నై జట్లతో జరిగిన మ్యాచ్లలో డకవుట్ గా వెనుతిరికాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక డకౌట్  అయిన ప్రేయర్ గాను రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు ఐపీఎల్లో రోహిత్ శర్మ ఒక్క అర్థ సెంచరీ ఢిల్లీ పై సాధించాడు అని చెప్పాలి. ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ తీవ్రంగా నిరాశపరిచాడు.

 అయితే రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యం పై స్పందించిన టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ బ్యాటింగ్ వైఫల్యంసాంకేతిక సమస్య వల్ల కాదని మానసిక ఒత్తిడి వల్లే అంటూ వీరేంద్ర సెహ్వాగ్ విశ్లేషించాడు. రోహిత్ బౌలర్లను ఎదుర్కోవట్లేదు తనను తానే మానసికంగా ఎదురుకుంటున్నాడు. అతని సమస్య సాంకేతికం కాదు మానసికం. రోహిత్ టెక్నిక్ లో లోపం ఏమీ కనిపించడం లేదు. కానీ అతని మనసులో గందరగోళం ఉన్నట్లు అనిపిస్తుంది. ఒక్కసారి గాడిలో పడితే వైఫల్యాలను మరిపించే సత్తా రోహిత్కు ఉంది అంటూ వీరేంద్ర సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: