ఏంటి.. యాంకర్ ఝాన్సీని.. ఇండస్ట్రీలో తొక్కేశారా?

praveen
యాంకర్ ఝాన్సీ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రస్తుతం చక్రం తిప్పుతున్న యాంకర్ సుమ కంటే ముందు ఇండస్ట్రీలో యాంకర్ గా పరిచయమైంది ఝాన్సీ. అంతేకాదు లేడీ క్వీన్ గా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఎన్నో కార్యక్రమాలకు హోస్ట్ గా పని చేసిన ఝాన్సీ ఇప్పుడైతే బుల్లితెరపై ఎక్కువగా కనిపించడం లేదు. కానీ వెండితెరపై మాత్రం వరుసగా అవకాశాలు అందుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. తనలో యాంకర్ మాత్రమే కాదు ఒక గొప్ప నటి దాగి ఉంది అన్న విషయాన్ని నిరూపిస్తుంది.

 ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ ఆ పాత్రలకు ఝాన్సీ ప్రాణం పోస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇటీవల కాలంలో కొంతమంది డైరెక్టర్లు అయితే ఝాన్సీ కోసమే ప్రత్యేకంగా కొన్ని పాత్రలు రాసుకుంటూ ఉన్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ ఇక తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో తనను కావాలని తొక్కేసారంటూ షాకింగ్ కామెంట్స్ చేయడం గమనార్హం. నా గురించి కొత్తలో చాలామంది ఫైర్ బ్రాండ్, పొగరు ఎక్కువ అని అనుకునేవారు.

 కానీ నాతో కలిసి పనిచేసిన వారికే నేను ఏంటో అన్నది తెలుసు. నన్ను అర్థం చేసుకున్నవారు కొన్నేళ్ల పాటు నాతో జర్నీ చేశారు. నచ్చని వాళ్ళు 13 ఎపిసోడ్స్ తోనే పుల్ స్టాప్ పెట్టేసారు. ఇంకా దారుణం ఏంటంటే డాన్స్ షోకి 99 ఎపిసోడ్లకు నేను యాంకర్ గా చేస్తే.. 100వ ఎపిసోడ్కి మాత్రం నా స్థానంలో వేరే వాళ్ళతో యాంకరింగ్ చేయించారు. కారణం ఏంటన్నది ఇప్పటికి నాకు తెలియదు. అయితే నాకు రావాల్సిన గుర్తింపు ఎన్నో సందర్భాల్లో రాకుండా పోయింది. ఎంతోమంది నన్ను మోసం చేశారు. ఇలాంటి మోసాలు చూసి కుంగుబాటుకు గురయ్యాను. కానీ వారిపై కక్ష సాధింపు కు ఎప్పుడు ప్రయత్నించలేదు. అది నా మంచితనమో పిచ్చితనమో నాకే అర్థం కాదు అంటూ ఝాన్సీ కామెంట్స్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: