కేఎల్ రాహుల్ ప్లేస్ లో.. అతనే కరెక్ట్.. రవి శాస్త్రి కామెంట్స్?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగిసిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే అటు టీమిండియా డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇంగ్లాండులోని ఓవల్ మైదానంలో ఇక ఈ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది. ఆస్ట్రేలియా తో ఈ ఫైనల్ మ్యాచ్లో తలబడబోతుంది టీమిండియా. అయితే డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఇప్పటికే టీమిండియా 15 మంది ఆటగాళ్లతో కూడిన జట్టు వివరాలను ప్రకటించింది. అయితే ఐపీఎల్లో ఆడుతున్న ఎంతోమంది ప్లేయర్లు గాయాల బారిన పడుతున్నారు. వెరసి డబ్ల్యూటీసి ఫైనల్ కోసం అటు బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 అయితే ఇటీవల ipl లో మ్యాచ్ సందర్భంగా టీమిండియా కీలక ప్లేయర్ కేఎల్ రాహుల్ గాయం బారిన పడ్డాడు. దీంతో ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కి కూడా అతను దూరం అయ్యాడు. అయితే అతని స్థానంలో ఇషాన్ కిషన్ కు ఛాన్స్ ఇస్తూ బీసీసీఏ నిర్ణయం తీసుకుంది. అయితే అతన్ని జట్టులోకి తీసుకోవడం పై మాత్రం విమర్శలు వస్తున్నాయి అని చెప్పాలి. దేశవాళీ క్రికెట్లో పరుగుల సునామీ సృష్టిస్తున్న సర్పరాజ్ ఖాన్ ను కాదని ఇషాన్ కిషన్ ను ఎంపిక చేయడం ఎంతవరకు సబబు అంటూ నేటిజన్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

 ఇకపోతే ఇటీవల ఇదే విషయంపై టీమ్ ఇండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. భరత్ ఇకనైనా ఆడాలి. ఇంగ్లాండులో ఆడేటప్పుడు అక్కడ పరిస్థితులను బట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని చూస్తే.. మీరు మీ బెస్ట్ కీపర్ తో ఆడాలి. ఇక ఆ కీపర్ బ్యాట్స్మెన్ అయ్యుంటే మరీ మంచిది. ఈ సమయంలో సర్ఫరాజ్   కూడా ఎంతో ఉపయోగపడతాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. దేశవాళి క్రికెట్లో సర్ఫరాజ్ ఖాన్ వండర్స్ చేస్తున్నాడు. ఒకవేళ అతను వికెట్ల వెనుక ఉంటే అది భారత్కు మేలు చేకూర్చే విధంగానే ఉంటుంది. అయితే అటు ఇషాన్ కిషన్ మంచి క్రికెటర్ అయినప్పటికీ గత కొంతకాలం నుంచి విఫలమవుతున్నాడు అంటూ రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: