సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్ లో.. కోహ్లీ ప్రస్తావన.. ధోని ఏమన్నాడంటే?

praveen
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీ అత్యుత్తమ క్రికెటర్ గా కొనసాగుతూ ఉన్నాడు. అది అంతర్జాతీయ మ్యాచ్ అయిన ఐపీఎల్ మ్యాచ్ అయినా సరే ఇక ప్రత్యర్థి జట్టు అతన్ని అవుట్ చేసేందుకు ప్రత్యేకమైన వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. అతన్ని ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై పక్కా ప్లానింగ్ తోనే బరిలోకి దిగుతూ ఉంటుంది. అయితే ఇక ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని సైతం కోహ్లీ కోసం ప్రత్యేకమైన వ్యూహరచన చేస్తున్నాడు అన్నది తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది.

 చెన్నై సూపర్ కింగ్స్ జట్టు డ్రెస్సింగ్ రూమ్ లో ఏకంగా వ్యూహరచన సమయంలో విరాట్ కోహ్లీ ప్రస్తావన వచ్చింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మంచి ప్రదర్శన చేస్తూ ఆరెంజ్ క్యాప్ రేస్  లో ఉన్న విరాట్ కోహ్లీ కోసం.. ధోని చెన్నై బౌలర్లకు ఇక సూచనలు ఇస్తూ ఉండడం గమనార్హం. విరాట్ కోహ్లీ ఎప్పుడు మొదటి బంతిని అలా ఆడడు.. బ్యాటు ఎప్పుడు ఇక్కడ ఇలా ఉంటుంది అంటూ ధోని తన జట్టు బౌలర్లకు సూచిస్తున్నట్లు ఈ వీడియోలో చూస్తే అర్థమవుతుంది. ధోని ఎవరైనా ఆటగాడిని అవుట్ చేసేందుకు ప్లాన్ వేశాడంటే చాలు అది సూపర్ సక్సెస్ అవుతూ ఉంటుంది.

 మొన్నటికి మొన్న ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ల వెనకాల ఉండి వేసిన వ్యూహం కాస్త సక్సెస్ అయింది. ధోని వ్యూహంలో పడిపోయినా రోహిత్ శర్మ చివరికి పరుగుల ఖాతా తెలవకుండానే డకౌట్ గా వెనిదిరిగాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు విరాట్ కోహ్లీని కూడా ఇలాగే అవుట్ చేసేందుకు వ్యూహాలను రచిస్తూ ఉన్నాడు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని. ఇకపోతే క్రికెట్ విషయం పక్కన పెడితే ధోని, విరాట్ కోహ్లీ మధ్య ఎంత బలమైన బంధం ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒక్క తల్లి కడుపున పుట్టిన అన్నదమ్ముల్లా గానే ఇద్దరు మెలుగుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: