వావ్.. ఆయన కూడా ధోనీకి అభిమానేనట తెలుసా?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టికెట్ కలెక్టర్ స్థాయి నుంచి ఏకంగా దేశం గర్వించ దగ్గ క్రికెటర్ స్థాయికి ఎదిగాడు ధోని. ఇక అతను లైఫ్ లో ఎదిగిన విధానం నేటి యువతకు స్ఫూర్తిదాయకం అనడం లో అతిశయోక్తి లేదు. ఐతే ఇప్పటి వరకు భారత క్రికెట్లో ఏ కెప్టెన్కు సాధ్యం కాని రీతిలో మూడు సార్లు ఐసీసీ ట్రోఫీలు అందించిన ఏకైక కెప్టెన్ గా కొనసాగుతున్నాడు మహేంద్ర సింగ్ ధోని.

 వరల్డ్ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్ గా.. బెస్ట్ వికెట్ కీపర్ గా.. బెస్ట్ ఫినిషిర్ గా కూడా తన హవా నడిపించాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం ధోని అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన.. అటు ఐపీఎల్ ద్వారా మాత్రం ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాడు. అయితే ధోనిలో ఉండే మిస్టర్ కూల్నెస్ ఇక అభిమానులను ఎప్పుడు ఫిదా చేస్తూ ఉంటుంది. క్లిష్టమైన సమయాల్లో సైతం చిరునవ్వుతో కనిపిస్తూ ధోని ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు. తన వ్యూహాలతో మ్యాచ్ స్వరూపాన్ని మొత్తం మార్చేస్తూ ఉంటాడు.

 ఇక ధోని ఆట తీరు కెప్టెన్సీ చూసిన తర్వాత ఎవరైనా సరే అతనికి అభిమానిగా మారిపోవాల్సిందే అని చెప్పాలి. అయితే తాను కూడా ధోని అభిమానినే అంటూ చెబుతున్నాడు ఏకంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. తమిళనాడు ముఖ్యమంత్రి ఏంకే స్టాలిన్ ధోనీకి నేను వీరాభిమానిని అంటూ ఇటీవలే చెప్పాడు. రాష్ట్ర దత్తపుత్రుడిగా ధోని సీఎస్కే తరఫున కొనసాగుతారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అయితే చెన్నైలో జరిగిన క్రీడా కార్యక్రమంలో మాట్లాడిన స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దేశంలోని లక్షలాది మంది యువతకు ధోని స్ఫూర్తి అంటూ స్టాలిన్ చెప్పుకొచ్చారు. క్రికెట్లోనే కాకుండా ఇతర క్రీడల్లోనూ తమిళనాడు నుంచి ఎంతోమంది ధోనీలను సృష్టించాలని కోరుకుంటున్నట్లు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: