పేరుకే విదేశీ ప్లేయర్.. కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా?

praveen
ఇంగ్లాండ్ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా కొనసాగుతున్న జోరూట్ ఇటీవల ఐపీఎల్లో అరంగేట్రం చేశాడు అనే విషయం తెలిసిందే. 2023 ఐపీఎల్ సీజన్లో ఇటీవలి రాజస్థాన్ రాయల్స్ జట్టులోకి వచ్చాడు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఇటీవల జరిగిన మ్యాచ్లో ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో తన తొలి మ్యాచ్ ఆడాడు. అయితే ఇలా సన్రైజర్స్ తో జరిగిన మ్యాచ్లో తొలి మ్యాచ్ ఆడిన జోరూట్ ఒక అరుదైన రికార్డును తన పేరును లికించుకున్నాడు అని చెప్పాలి. అదేంటంటే ఇంగ్లాండ్ క్రికెటర్ జోరూట్ అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం నుంచి ఐపీఎల్ డెబ్యూ  వరకు అన్నీ కూడా భారత్లోనే జరిగాయి అని చెప్పాలి.

 అంతర్జాతీయ క్రికెట్లో జోరూట్ తన టెస్ట్ డెబ్యు మ్యాచ్  ను నాగపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆడాడు. ఇక వన్డే ఫార్మాట్లో జో రూట్ డెబ్యు మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జరిగిన మ్యాచ్ లో చోటుచేసుకుంది. ఇక టి20 ఫార్మాట్లో జోరూట్ డెబ్యు మ్యాచ్ ముంబై వేదికగా జరిగిన మ్యాచ్ లో జరిగింది అని చెప్పాలి. ఇక్కడ కామన్ పాయింట్ ఏమిటంటే ఈ మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి టీమిండియానే కావడం గమనార్హం.  అయితే ఇటీవల జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్లో ఐపీఎల్ అరంగేట్రం కూడా చేశాడు జో రూట్. అయితే ఇప్పటివరకు ఏ అంతర్జాతీయ క్రికెటర్ కూడా తన అన్ని డెబ్యు మ్యాచ్లను ఇలా ఒకే దేశంలో ఆడిన దాఖలాలు లేవు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే జోరూట్ ఒక అరుదైన రికార్డును సృష్టించాడు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతోమంది అభిమానులు.. జోరూట్ కేవలం పేరుకు మాత్రమే ఇంగ్లాండ్ ప్లేయర్ కానీ అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఐపీఎల్ దాకా అన్నీ ఇండియాలోనే జరిగాయి అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. దీన్నిబట్టి చూస్తే ప్రాక్టికల్ గా జో రూట్ మనోడే అంటూ అటు రాజస్థాన్ రాయల్స్ ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో స్టార్ ప్లేయర్గా ఎదిగిన జోరూట్ మరి ఐపీఎల్లో ఎలాంటి ప్రస్థానాన్ని కొనసాగిస్తాడు చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: