సన్రైజర్స్ గెలిచింది అంటే.. కేవలం అతని వల్లే?

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలైన క్రికెట్ ఎంటర్టైన్మెంట్ కి కేరాఫ్ అడ్రెస్  గా మారిపోయింది అని చెప్పాలి. చివరి బంతి వరకు కూడా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరిగిన మ్యాచ్ ప్రేక్షకులకు అసలు సిస్థలైన క్రికెట్ మజాను పంచింది. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెట్టింది. టీవీల ముందు కూర్చున్న ప్రేక్షకులు అందరిని కన్నారపకుండా మ్యాచ్ చూసేలా చేసింది ఈ మ్యాచ్ లోని ఉత్కంఠ. చివరికి ఈ ఉత్కంఠ భరితమైన పోరులో ఎవరు ఊహించని విధంగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించింది అని చెప్పాలి.

 ఈ మ్యాచ్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసింది రాజస్థాన్ రాయల్స్ జట్టు. ఈ క్రమంలోనే నిర్ణీత 20 ఓవర్లలో కేవలం రెండు వికెట్ల నష్టానికి 214 పరుగుల భారీ స్కోరు చేసింది. అయితే రాజస్థాన్ ఇంత భారీ స్కోర్ చేసినప్పుడే సన్రైజర్స్ ఓటమి ఖాయం అని అందరూ ఫిక్స్ అయిపోయారు. కానీ ఊహించని రీతిలో సన్రైజర్స్ ఇంత భారీ పరుగులను ఛేదించి చివరికి ఉత్కంఠ భరితమైన పోరులో ఘనవిజయాన్ని అందుకుంది. అయితే సన్రైజర్స్ ఇంత భారీ స్కోరును చేదించింది అంటే సొంత అభిమానులు కూడా నమ్మలేకపోయారు అనడంలో సందేహం లేదు.  ముఖ్యంగా సన్రైజర్స్ ఇన్నింగ్స్ సమయంలో 18 ఓవర్ మ్యాచ్ మొత్తానికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు.

 174 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది సన్ రైజర్స్ జట్టు విజయానికి 12 బంతులు 41 పరుగులు కావాలి. దాదాపు గెలుపు అసాధ్యమని అందరికీ అర్థమైంది. ఇలాంటి సమయంలో గ్లెన్ ఫిలిప్స్ మాత్రం సుడిగాలి ఇన్నింగ్స్ ఆడాడు. ఒక్క ఓవర్ తోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ను చీల్చి చెండాడాడు అని చెప్పాలి. హ్యాట్రిక్ సిక్సర్లతో పాటు ఒక బౌండరీ బాది ఒకే ఓవర్ లో 22 పరుగులు పిండుకున్నాడు. ఓవరాల్ గా  ఏడు బంతుల్లో మూడు సిక్సర్లు ఒక ఫోర్ తో 25 పరుగులు చేసే విధ్వంసం సృష్టించి అవుట్ అయ్యాడు. ఒకవేళ అతను ఈ విధ్వంసక ఇన్నింగ్స్ ఆడకపోయి ఉంటే మాత్రం సన్రైజర్స్ కు ఓటమి తప్పేది కాదు అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: