నక్కతోక తొక్కాడు.. లక్కంటే హార్దిక్ పాండ్యాదే

praveen
సాధారణంగా అంతర్జాతీయ క్రికెట్ లో ఉండే రూల్స్ కొన్ని కొన్ని సార్లు అటు ప్లేయర్లకు తలనొప్పులు తెచ్చి పెడుతూ ఉంటాయ్. ఇక మరికొన్నిసార్లు అవే రూల్స్ ఏకంగా లాభాన్ని చేకూరుస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన మ్యాచ్లో గుజరాత్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాకు ఇలా క్రికెట్ రూల్ అదృష్టం కలిసి వచ్చేలా చేసింది. దీంతో ఈ విషయం గురించి తెలిసి లక్ అంటే హార్దిక్ పాండ్యాదే. నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాడు అంటూ కామెంట్లు చేస్తూ ఉన్నారు ఎంతోమంది అభిమానులు.

ఇంతకీ ఏం జరిగింది అనుకుంటున్నారా.. సాధారణంగా క్రికెట్లో ఉన్న రూల్ ప్రకారం బంతి వికెట్లకు తగిలినప్పుడు తప్పనిసరిగా వికెట్ల పైన ఉన్న బెయిల్స్ కింద పడాల్సిందే. అలా కింద పడినప్పుడు మాత్రమే దానిని అవుట్ గా ప్రకటిస్తూ ఉంటారు ఎంపైర్లు. ఒకవేళ బంతి వికెట్లకు తాకిన బెయిల్ కింద పడకపోతే మాత్రం ఇక దానిని నాటౌట్ గానే పరిగణిస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఈ రూల్ అటు హార్దిక్ పాండ్యాకు బాగా కలిసి వచ్చింది. మొదటి బంతికే అవుట్ అయ్యే ప్రమాదం నుంచి హార్దిక్ పాండ్యా తప్పించుకున్నాడు.

 ఇంతకీ ఏం జరిగిందంటే.. ఇన్నింగ్స్ 13వ ఓవర్ మూడో బంతిని ఆవేష్ ఖాన్ గుడ్ లెంత్ డెలివరీ వేశాడు. అయితే ఫ్లిక్ చేయడంతో మిస్ అయిన బంతి హార్దిక్ పాండ్యా ప్యాడ్లను తాకి వికెట్ల వెనకాలకు వెళ్ళింది. అయితే బంతి వేగంగా వికెట్లను తాకినప్పటికీ బెయిల్స్ మాత్రం కింద పడలేదు. దీంతో వికెట్లను బంతి తాకిన అటు హార్దిక్ పాండ్యా నాట్ అవుట్ గానే నిలిచాడు. ఒకవేళ బేయిల్స్ కింద పడి ఉంటే మాత్రం హార్దిక్ పాండ్యా గోల్డెన్ డకౌట్ గా వెను తిరగాల్సి వచ్చేది. ఇక ఈ సీన్ చూసిన క్రికెట్ ఫ్యాన్స్ లక్ అంటే హార్దిక్ పాండ్యాదే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: