వైరల్ : ధోని మాస్టర్ మైండ్ ముందు.. రోహిత్ బోల్తాపడ్డాడే?

praveen
ధోనీ తన మాస్టర్ మైండ్ తో వ్యూహం పన్నీతే ఎంతటి బ్యాట్స్మెన్ అయినా సరే బుట్టలో పడి వికెట్ కోల్పోవాల్సిందే అని చెబుతూ ఉంటారు క్రికెట్ విశ్లేషకులు. అయితే ఇక ధోని మాస్టర్మెంట్ ఏ రేంజ్ లో ఉంటుంది అన్నదానికి నిదర్శనంగా ఇప్పటివరకు సోషల్ మీడియాలో చాలానే వీడియోలు ప్రత్యక్షమయ్యాయి. ఇకపోతే ఇటీవలే ఐపిఎల్ లో భాగంగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్లో ప్రత్యర్థి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మను బోల్తా కొట్టించేందుకు ధోని మరోసారి తన మాస్టర్ మైండ్ కి పదును పెట్టాడు.

 అద్భుతమైన వ్యూహంతో ముంబై కెప్టెన్ రోహిత్ శర్మను  పరుగులు ఖాతా తెరవకుండానే పెవిలియన్ పంపించడంలో సక్సెస్ అయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ మహేంద్ర సింగ్ ధోని. దీపక్ చాహార్ బౌలింగ్ చేస్తున్న సమయంలో ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అందుకు అనుగుణంగానే బ్యాక్వర్డ్ పాయింట్ స్లిప్.. థర్డ్ మ్యాన్ లో ఫీల్డింగ్ కూడా సెట్ చేశాడు మహేంద్రసింగ్ ధోని. అయితే ఆ తర్వాత చాహార్ బంతి వేయడానికి ముందే ధోని స్టంప్స్ దగ్గరికి వచ్చాడు. సాధారణంగా అయితే ఫాస్ట్ బౌలర్లు బౌలింగ్ చేస్తున్న సమయంలో వికెట్ కీపర్ లు వికెట్ కి కాస్త దూరంలో నిలబడి కీపింగ్ చేయడం చూస్తూ ఉంటాం.

 కానీ మాస్టర్ మైండ్ ధోని మాత్రం తన వ్యూహాల్లో భాగంగా ఇక చాహార్ బంతి వేయడానికి ముందే స్టంప్స్ దగ్గరికి వచ్చాడు. ఇది చూసి అభిమానులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. అయితే ఊహించినట్లుగానే చాహార్ స్లో బంతిని విసిరాడు. దీంతో రోహిత్ ల్యాబ్ షాట్ ఆడే ప్రయత్నంలో చివరికి విఫలమయ్యాడు. ఇక బంతి బ్యాడ్ ఎడ్జ్ తాకి బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా వెళ్లడం.. ఇక అక్కడే ప్లాన్ ప్రకారం ధోని సెట్ చేసిన ఫీల్డర్ జడేజా సింపుల్ క్యాచ్ తీసుకోవడం జరిగిపోయింది. ఈ వీడియో ట్విట్టర్లో వైరల్ గా మారిపోవడంతో.. ధోని మైండ్ గేమ్ కి ఎంతో రోహిత్ ని బుట్టలో వేసుకొని ఫలితం రాబట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: