పాక్ అరుదైన రికార్డ్.. క్రికెట్ హిస్టరీలో తొలిసారి?

praveen
ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ టీం ప్రదర్శన ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఏ మ్యాచ్లో గెలుస్తుంది ఏ మ్యాచ్లో ఓడిపోతుంది అన్నది కూడా విశ్లేషకుల ఊహ కిందన విధంగా ఉంటుంది. తప్పకుండా గెలుస్తుంది అనుకున్న మ్యాచ్ లో ఒత్తిడిని తట్టుకోలేక ఓడిపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇక ఓడిపోవడం ఖాయం అనుకున్న పరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకుని ప్రత్యర్థిని చిత్తూ  చేసిన సందర్భాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి అని చెప్పాలి. ప్రపంచ క్రికెట్లో పాకిస్తాన్ జట్టు ఓడిపోయిన గెలిచిన కూడా అది సంచలనంగానే మారిపోతూ ఉంటుంది.

 ఇలా పాకిస్తాన్ గెలుపోటములు ఎప్పుడు వరల్డ్ క్రికెట్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా కొనసాగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఇక ఇప్పుడు పాకిస్తాన్ విజయం ఇలాగే చర్చ నీయాంశంగా మారిపోయింది. మొన్నటి వరకు స్వదేశంలో వరుస సిరీస్లను కోల్పోయి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొన్న పాకిస్తాన్.. ఇక ఇటీవల న్యూజిలాండ్తో జరిగిన వన్డే సిరీస్ లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చేస్తుంది. నాలుగు మ్యాచ్ల వన్డే సిరీస్ లో వరుసగా నాలుగు మ్యాచ్ లలో కూడా విజయం సాధించి సత్తా చాటింది. దీంతో 4-0 తేడాతో కివీస్ ను క్లీన్ స్వీప్ చేసింది అని చెప్పాలి.

 అయితే ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో గెలవటం  ద్వారా అటు పాకిస్తాన్ ఒక అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో తొలిసారి పాకిస్తాన్ నెంబర్ వన్ గా నిలిచింది  అని చెప్పాలి. న్యూజిలాండ్ పై నాలుగు వన్డే మ్యాచ్ లు గెలవడంతో ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి తొలి స్థానం కైవసం చేసుకుంది. ఇక ఈ లిస్టులో భారత్ మూడో స్థానంలో ఉంది. ఇంగ్లాండ్ నాలుగో స్థానంలో న్యూజిలాండ్ ఐదో స్థానంలో ఉండడం గమనార్హం. అయితే వన్డే క్రికెట్ హిస్టరీలో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాకిస్తాన్ అగ్రస్థానాన్ని సొంతం చేసుకోలేదు. కానీ మొదటిసారి బాబర్ కెప్టెన్సీలో ఈ ఘనత సాధించింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: