ఇక IPL క్రికెట్లో 'ఎల్ క్లాసికో'గా పరిగణించే 'చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్' మ్యాచ్ ఈ రోజు అంటే శనివారం నాడు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై తరఫున ఆ టీమ్ కెప్టెన్ రోహిత్ శర్మ(0) తన ఖాతాని తెరవలేకపోయాడు.అతను మూడు బంతులు ఎదుర్కొని కూడా డకౌట్ అయ్యి దెబ్బకి వెనుదిరిగాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మ మరిచిపోలేని చెత్త రికార్డుని సొంతం చేసుకున్నాడు.అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఐపీఎల్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రోహిత్ శర్మతో పాటు సునీల్ నరైన్(కోల్‌కతానైట్ రైడర్స్), మన్దీప్ సింగ్(కోల్‌కతానైట్ రైడర్స్) ఇంకా అలాగే దినేష్ కార్తీక్(రాయల్ చాలెంజర్స్ బెంగళూరు) కూడా 15 డకౌట్లతో ఉన్నారు. కానీ ఈ మ్యాచ్‌లో దీపక్ చాహర్ వేసిన బంతికి రోహిత్ శర్మ ఖాతా తెరవకుండానే క్యాచ్ ఔట్ అవడం ద్వారా 16వ సారి డకౌట్ అవ్వడం జరిగింది. ఇలా ఐపీఎల్ చరిత్రలో ఏకంగా 16 సార్లు డకౌట్ అయిన రోహిత్ అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు.అయితే ఈ ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా రెండో సారి జరుగుతున్న 'చెన్నై టీమ్ vs ముంబై టీమ్' మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ మరో రికార్డును కూడా తిరగరాశాడు.
ఇక ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన కెప్టెన్‌గా గౌతమ్ గంభీర్ పేరిట ఉన్న రికార్డును కూడా రోహిత్ శర్మ తన సొంతం చేసుకున్నాడు. గతంలో కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరించిన గౌతమ్ గంభీర్ 10 డకౌట్లతో అత్యధిక సార్లు డకౌట్ అయిన సారధిగా చెత్త రికార్డును క్రియేట్ చేశాడు. కానీ నేటి మ్యాచ్‌లో కెప్టెన్‌గా 11వ సారి డకౌట్ అయిన రోహిత్ శర్మ ఇక ఆ చెత్త రికార్డును తిరగరాసి తన పేరిట లిఖించుకున్నాడు.ఇక చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ రోజు జరుగుతున్న మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి మొత్తం 139 పరుగులు చేసింది. ఈ క్రమంలో ముంబై తరఫున నేహల్ వధేరా(64) అర్థశతకంతో రాణించగా, సూర్య కుమార్ యాదవ్(26) ఇంకా ట్రిస్టన్ స్టబ్స్(20) పర్వాలేదనిపించారు. ఇక మిగిలినవారిలో ఏ ఒక్కరూ కూడా రెండంకెల స్కోర్ చేయలేకపోయారు. ఇంకా అలాగే చెన్నై బౌలర్లలో పతిరాణా 3 వికెట్లు తీసుకోగా, దీపక్ చాహార్, దేశ్‌పాండే చెరో 2 ఇంకా జడేజా ఒక వికెట్ తీసుకున్నారు.