ఆ ఓవర్లో.. నా హార్ట్ బీట్ 200కు చేరింది?

praveen
ఇటీవల ఐపీఎల్లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కత్తా నైట్ రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్ గా పిలుచుకునే ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ అటు ప్రేక్షకులు అందరికీ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే చివరి బంతి వరకు కూడా ఎవరు గెలుస్తారో అనే దానిపై క్లారిటీ లేకుండా పోయింది. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు.

 కానీ చివరికి గెలవాల్సిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోయి తీవ్రంగా నిరాశపరిచింది అని చెప్పాలి. చివరి ఓవర్లో 9 పరుగులు కావలసిన సమయంలో మ్యాచ్ మరింత ఉత్కంఠ గా మారిపోయింది. ఇక అలాంటి సమయంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు విజయం సాధించడం ఎంతో సులభంగా జరిగిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని రీతిలో మిస్టీరియస్ స్పిన్నర్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ చక్రవర్తి చివరి ఓవర్లో తన స్పిన్ బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు అని చెప్పాలి. ఆరు బంతుల్లో 9 పరుగులు కావాల్సిన సమయంలో కేవలం మూడు పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీసాడు.

 దీంతో సన్రైజర్స్ కు ఓటమి తప్పలేదు. అయితే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో మ్యాచ్లో చివరి ఓవర్ వేసే సమయంలో తన హార్ట్ బీట్ ఏకంగా 200 కు చేరింది అంటూ కోల్కతా బౌలర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. ఆఖరి ఓవర్లో అద్భుతమైన స్మెల్ తో ఈ స్పిన్నర్ మ్యాచ్ ను కోల్కతా వైపు తిప్పేశాడు. మొత్తంగా ఇక సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో నాలుగు ఓవర్లు వేసి 20 పరుగులు ఇచ్చి ఇక ఒక వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇకపోతే గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: