యూట్యూబ్ వీడియో కోసం అలా చేస్తే.. చివరికి ప్రాణం పోయింది?

praveen
ఒకప్పుడు బాగా చదువుకుని మంచి మార్కులు తెచ్చుకుని ఒక మంచి ఉద్యోగం సంపాదించాలని ఎంతో మంది ఆశ  పడేవారు. ఇలా చదువు ప్రారంభించిన ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి ఆలోచన ఉండేది. ఇక కొంత మంది వ్యాపారం చేస్తే ఎక్కువగా లాభాలు పొంది ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉందని అనుకునేవారు. కానీ ఇప్పుడు మాత్రం యువత ఆలోచన తీరు పూర్తిగా మారిపోయింది. ఉద్యోగమో వ్యాపారమో చేయడం కాదు.. ఏకంగా యూట్యూబ్లో ఏదో ఒకటి కొత్తగా ట్రై చేస్తే ఊహించని ఆదాయం వస్తుందని గట్టిగా నమ్ముతూ ఉన్నారు.

 ఈ క్రమంలోనే తమలో ఉన్న టాలెంట్ ని అటు యూట్యూబ్ వేదికగా బయటపెడుతున్నారు. వెరసి ఎంతోమంది ఫేమస్ అవుతూ ఇక లక్ష రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం అన్న విషయం తెలిసిందే. ఇలా యూట్యూబ్ ని ఆదాయంగా మార్చుకొని ఒకవైపు ఆదాయం మరోవైపు పాపులారిటీ సంపాదిస్తున్న వారు.. నేటి రోజుల్లో కోకోళ్లలుగా కనిపిస్తున్నారు. అయితే యూట్యూబ్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన కొంతమందికి ఊహించని ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. యూట్యూబ్ లో లైక్ లు కోసం కొంతమంది రిస్కీ విన్యాసాలు చేస్తూ ఉండటం చూస్తూ ఉన్నాం.

 ఇక్కడ ఒక యూట్యూబర్ ఇలాంటి పని చేసి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. యూట్యూబ్ వీడియో కోసం అతివేగంతో బైక్ నడిపి చివరికి ప్రాణాలు కోల్పోయాడు. ఉత్తరాఖండ్ డెహ్రాడూన్ కి చెందిన అగస్త్య చౌహన్ ప్రో రైడర్ 1000 అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నాడు. బైక్ రేస్ వీడియోలు దీనిలో అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఢిల్లీలో జరిగే టూవీలర్ లాంగ్ రైడ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్తూ 300 కిలోమీటర్ల వేగంతో బైక్ నడపగా.. బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు ఈ యూట్యూబర్. యూపీలోని అలీగడ్ జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: