ఐపీఎల్ : లేటు వయసులో.. దుమ్మురేపుతున్నారుగా?

praveen
సాధారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో యంగ్ ప్లేయర్స్ దే హవా నడుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఐపిఎల్ సీజన్లో ఎంతో మంది యంగ్ ప్లేయర్స్ తమ ప్రతిభ చాటుకుని తిరమీదికి వస్తూ ఉంటారు. అదిరిపోయే ప్రదర్శన చేస్తూ ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతూ ఉంటారు అని చెప్పాలి. కానీ ఈ ఏడాది మాత్రం యంగ్ ప్లేయర్స్ ఏమో కానీ అటు సీనియర్ ప్లేయర్స్ మాత్రం అదరగొడుతున్నారు అని చెప్పాలి. ముఖ్యంగా కెరియర్ ముగిసిపోయిందని అందరూ అనుకుంటున్న సీనియర్ ప్లేయర్స్ ఐపీఎల్ లోకి తక్కువ ధర సొంతం చేసుకుని అడుగుపెట్టినప్పటికీ.. ఇక ప్రదర్శనతో కోట్ల రూపాయలు ఆటగాళ్లు కూడా పనిచేయరేమో అనేంతలా అదరగొడుతున్నారు.

 ఫామ్ లో లేమితో ఒకప్పుడు టీమిండియాలో చోటు కోల్పోయిన ప్లేయర్లు.. అందరూ కూడా ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అదరగొడుతున్నారు. టెస్ట్ స్పెషలిస్ట్ ప్లేయర్ గా పేరు సంపాదించుకొని ఇక ఫామ్ కోల్పోయి టీమ్ ఇండియాలో చోటు కోల్పోయాడు సీనియర్ బ్యాట్స్మెన్ అజింక్య రహనే. ఒకప్పుడు వైస్ కెప్టెన్ గా ఉన్నప్పటికీ.. ఇప్పుడు అతనికి జట్టులో చోటే లేకుండా పోయింది. అలాంటి రహానేను అటు చెన్నై జట్టు నమ్మకం ఉంచి జట్టులోకి తీసుకుంది. అయితే అతనిపై ధోని పెట్టుకున్న నమ్మకాన్ని అతను ఒమ్ము చేయకుండా అదరగొడుతున్నాడు.

 ప్రతి మ్యాచ్ లో కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇప్పటివరకు ఏడు మ్యాచ్లలో 189.83 స్ట్రైక్ రేటుతో 224 పరుగులు చేశాడు. మరోవైపు సీనియర్ బౌలర్ సందీప్ శర్మ రాజస్థాన్ తరపున ఆడుతూ ఏడు మ్యాచ్లలో 8 వికెట్లు తీశాడు. ఇక ఢిల్లీ జట్టులోకి రావడం ద్వారా ఐపీఎల్ లో నాలుగు మ్యాచ్ లలో 6 వికెట్లు తీశాడు. మరో సీనియర్ బౌలర్ కరన్ శర్మ బెంగళూరు జట్టులో ఆడుతూ నాలుగు మ్యాచ్లో ఏడు వికెట్లు తీసాడు. ఇక స్పిన్నర్ చావ్లా ముంబై ఇండియన్స్ తరఫున ఎనిమిది మ్యాచ్ లలో 13 వికెట్లు తీసి సత్తా చాటాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: