గుజరాత్ ఓడినా.. ఆ జట్టు బౌలర్ అరుదైన రికార్డ్?

praveen
గత ఏడాది ఐపిఎల్ లోకి కొత్త జట్టుగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ జట్టు.. ఇక ఇప్పుడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ హోదాను సంపాదించుకుంది అన్న విషయం తెలిసిందే. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ జట్టు ఇక మొదటి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలిచింది అనడంలో అతిశయోక్తి లేదు. అయితే బౌలింగ్ విభాగంలో బ్యాటింగ్ విభాగంలో ఎంతో పటిష్టంగా కనిపిస్తున్న గుజరాత్ ప్రత్యర్థులను చిత్తు చేస్తూ 2023 ఐపీఎల్ సీజన్లోనూ అదరగొడుతుంది.

 ఇప్పటికే 9 మ్యాచ్ లలో ఆరు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతూ ఉంది అని చెప్పాలి. అయితే ఇలా పాయింట్ల పట్టికలో టాప్ పొజిషన్లో కొనసాగుతున్న గుజరాత్ జట్టు ఇక ఇటీవల ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం ఓడిపోవడం గమనార్హం. అయితే గుజరాత్ టైటాన్స్ జట్టు ఓడిపోయినప్పటికీ ఇక ఆ జట్టు బౌలర్ మోహిత్ శర్మ మాత్రం ఐపీఎల్లో అరుదైన రికార్డు సృష్టించాడు అని చెప్పాలి. ఇటీవల మ్యాచ్లో వికెట్ పడగొట్టడం ద్వారా ఏకంగా 100 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చేరాడు. ఇప్పుడు వరకు ఐపీఎల్ హిస్టరీలో 92 మ్యాచులు ఆడిన మోహిత్ శర్మ 34 ఏళ్ల వయసులో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే ఒక అరుదైన ఘనతను సాధించాడు. 100 వికెట్లు పడగొట్టిన అత్యంత పెద్ద వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు గుజరాత్ టైటాన్స్ బౌలర్ మోహిత్ శర్మ. అదే సమయంలో ఐపీఎల్ హిస్టరీలో 100 వికెట్లు సాధించిన పదవ భారత ఫాస్టు బౌలర్ గా కూడా అరుదైన రికార్డును సాధించాడు. ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో కీలకమైన సమయంలో రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టాడు మోహిత్ శర్మ. ఇకపోతే ఈ ఏడాది గుజరాత్ టైటాన్స్ జోరు చూస్తే ఇక వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ఎగరేసుకుపోవడం ఖాయమని అభిమానులు అందరూ కూడా బలంగా నమ్ముతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: