కోహ్లీ, గంభీర్ గొడవ.. బిగ్ షాక్ ఇచ్చిన రిఫరీ?

praveen
ఐపీఎల్ లో భాగంగా ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్ లో అటు బెంగళూరు జట్టు విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన బెంగళూరు తక్కువ పరుగుల చేసినప్పటికీ ఆ తర్వాత ఇక ఆ తక్కువ టార్గెట్ ను కాపాడుకుంటూ చివరికి విజయాన్ని సాధించింది అని చెప్పాలి. అయితే మ్యాచ్ మొత్తంలో ఆటగాళ్ల ప్రదర్శన ఒక ఎత్తు అయితే.. మ్యాచ్ చివర్లో  గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల మధ్య జరిగిన ఫైట్ ఒక ఎత్తు అని చెప్పాలి.

 గతంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఆర్సిబి పై లక్నో గెలిచినప్పుడు.. గౌతమ్ గంభీర్ ఇక ఆర్సిబి అభిమానులు అందరూ కూడా సైలెంట్ గా ఉండాలి అంటూ సైగ చేస్తూ కమ్మింపులకు పాల్పడ్డాడు. అయితే అది మనసులో పెట్టుకున్న కోహ్లీ, లక్నో వేదికగా లక్నో జట్టుపై విజయం సాధించడంతో గతంలో గంభీర్ చేసినట్లుగానే ఇక లక్నో అభిమానులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా సైగలు చేశాడు. దీంతో ఇక ఎంతో దూకుడుగా ఉండే గౌతమ్ గంభీర్ రెచ్చిపోయాడు. ఇక ఎనర్జీకి కేరాఫ్ అడ్రస్ గా ఉండే కోహ్లీ సైతం అదే రీతిలో కోపంతో ఊగిపోయాడు.

 ఇలా విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన గొడవ మాత్రం మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇకపోతే ఇక విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ తీవ్రస్థాయిలో గొడవ పడిన నేపథ్యంలో మ్యాచ్ రిఫరీ దీనిపై సీరియస్ గా స్పందించారు. వారిద్దరి మ్యాచ్ ఫీజులో ఏకంగా 100% ఫైన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. అలాగే గొడవకు కారణమైన లక్నో ఆటగాడు నవీన్ ఉల్ హక్ కీ 50 శాతం ఫైల్ విధించాడు రిఫరి. ఐపీఎల్ నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఈ చర్యలు తీసుకున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక త్వరలో రిఫరీ వీరిద్దరితో స్వయంగా మాట్లాడబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: