టెస్ట్ క్రికెట్ చరిత్రలో.. శ్రీలంక అత్యంత అరుదైన రికార్డ్?

praveen
పరిమిత ఓవర్ల ఫార్మాట్ లో ఎన్ని రికార్డులు సృష్టించినప్పటికీ సాంప్రదాయమైన క్రికెట్ గా పేరుగాంచిన సుదీర్ఘమైన టెస్ట్ ఫార్మాట్లో రికార్డులు కొల్లగొట్టడానికి ప్రతి ఒక్క క్రికెటర్ ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇక టెస్ట్ ఫార్మాట్లో ఛాన్స్ వచ్చిందంటే చాలు ఎంతో నిలకడగా రాణిస్తూ అదరగొడుతూ ఉంటారు క్రికెటర్లు. ఇక టెస్ట్ ఫార్ముట్ లొ ఎవరైనా క్రికెటర్ అరుదైన రికార్డు సాధించాడు అంటే చాలు అది కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా  మారిపోతూ ఉంటుంది.

 ఇక ఇప్పుడు శ్రీలంక జట్టు సైతం సాంప్రదాయమైన క్రికెట్ అయినా టెస్ట్ ఫార్మాట్లో ఇలాంటి ఒక అరుదైన రికార్డు సృష్టించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో కీ ఇప్పటివరకు కేవలం రెండుసార్లు మాత్రమే సాధ్యమైన ఒక రికార్డును ఇక ఇప్పుడు శ్రీలంక జట్టు మూడోసారి సాధించి అదరగొట్టింది అని చెప్పాలి. ప్రస్తుతం శ్రీలంక, ఐర్లాండ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతుంది అన్న విషయం తెలిసిందే. పసి కున ఐర్లాండ్ పై శ్రీలంక జట్టు  ప్రతాపం చూపుతుంది. ఆ జట్టులోని బ్యాట్స్మెన్లు అందరూ కూడా భారీగా పరుగులు చేస్తూ ఎన్నో రికార్డులు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఐర్లాండ్తో జరిగిన రెండవ టెస్టులో శ్రీలంక అరుదైన ఘనత సృష్టించింది.

 రెండో టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో ఏకంగా మూడు వికెట్ల నష్టానికి 704 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది శ్రీలంక జట్టు. ఇందులో మధుషక 205, కుషాల్ మెండేస్ 245 కరుణ రత్నే 115, మ్యాథ్యూస్ 100 పరుగులు చేసి అదరగొట్టారు అని చెప్పాలి. ఇలా టాప్ ఆర్డర్లో ఉన్న నలుగురు బ్యాట్స్మెన్లు కూడా సెంచరీలు  చేయడం ఇక టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది కేవలం మూడోసారి మాత్రమే. గతంలో 2007లో బంగ్లాదేశ్ పై ఇండియా ఆడిన టెస్టులో దినేష్ కార్తీక్, వసీం జాఫర్, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ సెంచరీ చేశారు.. 2019లో శ్రీలంక పై పాకిస్తాన్ ఆడిన టెస్టులో బాబర్, అజర్, షాన్ మసూద్, అబిద్ అలీ సెంచరీలు చేశారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: