RCB కప్పుకొట్టే వరకు స్కూల్ వెళ్ళను.. బుడ్డోడు ప్లాన్ భలే ఉంది?

praveen
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో అటు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ టీమ్ ఒక్కసారి కూడా అటు టైటిల్ గెలవలేదు. అయినప్పటికీ ప్రతి ఏడాది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు మద్దతుగా నిలుస్తున్న అభిమానుల సంఖ్య మాత్రం అంతకంతకు పెరిగిపోతూనే ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే బెంగళూరు జట్టు ఎక్కడ మ్యాచ్ ఆడినా కూడా అభిమానులు భారీగా స్టేడియం కు తరలివచ్చి.. తమ ఫేవరెట్ టీం ను ఎంకరేజ్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు వరకు ప్రతిసారి టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఒక్కసారి కూడా ఐపీఎల్ విజేతగా నిలవలేకపోయింది. కానీ ప్రతిసారి కూడా ఈసారి కప్పు మనదే అంటూ అభిమానులు మాత్రం ఎక్కడా నిరాశపడకుండా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. అయితే ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మ్యాచ్ ఆడుతుందంటే చాలు ఎంతోమంది అభిమానులు ఆసక్తికర ఫ్లకార్డులు మైదానంలో ప్రదర్శించడం లాంటివి చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే గతంలో ఓ మహిళ అభిమాని పట్టుకున్న ఫ్లకార్డు హాట్ టాపిక్ గా మారిపోయింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కప్పు కొట్టేంతవరకు తాను పెళ్లి చేసుకోను అంటూ రాసి ఉన్న ఫ్లకార్డు పట్టుకుంది. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఏకంగా స్కూల్ ఎగ్గొట్టేందుకు ఇక్కడ ఒక బుడ్డోడు పెద్ద ప్లానే వేశాడు. ఈ ఐపిఎల్ సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు సపోర్ట్ చేస్తూ.. ఆ జట్టు జెర్సీ వేసుకున్నాడు ఇక్కడొక బుడ్డోడు. ఆర్సిబి టీం ఐపీఎల్ కప్ గెలిచే వరకు తాను స్కూలుకు వెళ్ళను అంటూ రాసి ఉన్న ఒక ఫ్లకార్డు పట్టుకున్నాడు. ఇక ఈ ప్లకార్డు చూసి స్కూల్ ఎగొట్టేందుకు బుడ్డోడి ప్లాన్ భలే ఉంది అంటూ నేటిజన్స్ నవ్వుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rcb

సంబంధిత వార్తలు: