డబ్ల్యూటీసి ఫైనల్ కోసం.. గవాస్కర్ ప్లేయింగ్ 11 జట్టు ఇదే?

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా నరాలు తెగే ఉత్కంఠ మధ్య జరుగుతున్న నేపథ్యంలో క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ కూడా పండగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి.  అయితే ఐపీఎల్ ముగిసిన వెంటనే అటు టీమిండియా జట్టు ఒక కీలకమైన మ్యాచ్ ఆడబోతుంది. ఐపీఎల్ ఫైనల్ జరిగిన కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది.

 ఇక ఈ ఐసీసీ టోర్నీ ఫైనల్ మ్యాచ్లో భాగంగా ఆస్ట్రేలియా తో తలబడబోతుంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ లో గెలిచి విశ్వ విజేతగా నిలవాలని భావిస్తుంది. ఇక ఎన్నో రోజుల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ గెలవాలని ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోనే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడబోయే జట్టును ఇటీవల బీసీసీఐ ప్రకటించింది. ఏకంగా 15 మంది సభ్యులను ఇందుకోసం ఎంపిక చేసింది. ఈ క్రమంలోనే ఇక ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుంది అనేదానిపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు రివ్యూ ఇవ్వడం మొదలుపెట్టారు అని చెప్పాలి.

 అంతేకాదు ఇక మాజీ ప్లేయర్లు ప్రతి మ్యాచ్ కోసం తమ ప్లేయింగ్ ఎలవెన్ జట్టును ప్రకటించడం ఇటీవల కాలంలో ట్రెండ్ గా మారిపోయింది. అటు లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ఇదే చేశాడు. టీమిండియా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ కోసం 15 మంది సభ్యులను ఎంపిక చేయగా.. ఇందులో సునీల్ గవాస్కర్ తన ప్లేయింగ్  ఎలవెన్ ఎంపిక చేశాడు. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్..మిడిల్ ఆర్డర్లో పూజార, విరాట్ కోహ్లీ, రహానే.. వికెట్ కీపర్ గా కేఎల్ రాహుల్.. ఆల్ రౌండర్లుగా రవీంద్ర జడేజా, అశ్విన్.. ఇక బౌలర్లుగా జయదేవ్,  సిరాజ్ షమీలను ఎంపిక చేసాడు సునీల్ గవాస్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: