అర్జున్ టెండూల్కర్ పై విమర్శలు.. బ్రెట్ లీ ఏమన్నాడంటే?

praveen
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానుల అందరీ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. గత కొన్ని సీజన్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టులో కొనసాగుతున్న సచిన్ టెండూల్కర్ కొడుకు అర్జున్ టెండూల్కర్ కి తుది జట్టు లో మాత్రం చాన్స్ దక్కలేదు. ఇక ఎప్పుడెప్పుడు అతనికి ఛాన్స్ వస్తుందా అని అభిమానులందరూ వేయికళ్లతో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ద్వారా అతనికి ఐపిఎల్ లో ఆడే ఛాన్స్ దక్కింది అన్న విషయం తెలిసిందే..

 ఈ క్రమంలోనే అతను బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. బ్యాటింగ్లో కూడా పరవాలేదు అనిపిస్తున్నాడు అర్జున్ టెండూల్కర్. ముఖ్యంగా పవర్ ప్లే లో పరుగులు కట్టడి చేయాల్సిన సమయంలో అతని బౌలింగ్ చేసే విధానం అయితే అద్భుతంగా ఉంది అని చెప్పాలి. కానీ డెత్ ఓవర్లలో మాత్రం ఒత్తిడికి గురవుతూ ఎక్కువగా పరుగులు సమర్పించుకుంటూ ఉన్నాడు. ఇక ఇటీవల ఇలా ఏకంగా ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్న అర్జున్ టెండూల్కర్ విమర్శలు ఎదుర్కొంటున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇలా ఆడితే కష్టమేనని.. ముంబై ఇండియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని అర్జున్ వమ్ము చేస్తున్నాడు అంటూ ఎంతో మంది విమర్శలు చేస్తున్నారు.

 అయితే సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ప్రదర్శన పై వస్తున్న విమర్శల గురించి ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ స్పందిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. అర్జున్ టెండూల్కర్ వయస్సు ప్రస్తుతం కేవలం 23 ఏళ్లు మాత్రమే అందుకే విమర్శలను పట్టించుకోవద్దు అంటూ సూచించాడు. అర్జున్ టెండూల్కర్ ని  విమర్శలు చేసేవారు. కేవలం కీబోర్డు యోధులు మాత్రమే అంటూ దుయ్యబడ్డాడు. కాగా ఇటీవలే పంజాబ్ కిమ్స్ తో జరిగిన మ్యాచ్లో ఒకే ఓవర్లో 31 పరుగులు సమర్పించుకున్న అర్జున్ టెండూల్కర్ ఇక డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయడానికి పనికిరాడు అంటూ విమర్శలు వచ్చాయి అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: