ఓవరాక్షన్ స్టార్ రియాన్‌ పరాగ్‌ కి గట్టి షాక్?

Purushottham Vinay
ఇక ఐపీఎల్‌-2023 సీజన్లో  వరుసగా రెండు ఓటములు చవిచూసిన రాజస్తాన్ రాయల్స్‌ టీం ఇప్పుడు మరో కీలక మ్యాచ్ కి రెడీ అయ్యింది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్‌ వేదికగా అద్భుత ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ లాంటి సూపర్ టీంతో గురువారం నాడు అనగా ఈ రోజు రాజస్తాన్‌ టీం తలపడనుంది.ఈ కీలకమైన మ్యాచ్‌లో ఎలాగైనా సరే గెలిచి తిరిగి గాడిన పడాలని సంజు శాంసన్‌ సేన గట్టిగా ఫిక్స్ అయ్యింది. అయితే ఈ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ కేవలం ఒకే మార్పుతో బరిలోకి దిగాలని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది.ఇక పెద్దగా రాణించలేకపోతున్న ఆల్‌రౌండర్‌ జాసన్‌ హోల్డర్‌ స్థానంలో స్పిన్నర్‌ ఆడమ్‌ జంపాకు ఛాన్స్ ఇవ్వాలని రాజస్తాన్‌ టీం మేనెజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ జైపూర్‌ పిచ్‌ అనేది స్పిన్నర్లకు చాలా బాగా అనుకూలిస్తుంది. అందువల్ల కచ్చితంగా జంపా తుది జట్టులోకి వచ్చే ఛాన్స్‌ ఉంది.


ఇక వరుసగా విఫలమవుతున్న ఆల్‌రౌండర్‌ తన ఓవర్ యాక్టింగ్ తో నెట్టింట ఘోరంగా తిట్ల పాలవుతున్న రియాన్‌ పరాగ్‌ కి దిమ్మతిరిగి బొమ్మ కనపడే షాక్ ఇచ్చింది రాజస్థాన్ టీం. ఈ ఓవర్ యాక్షన్ ఆటగాడు మరోసారి బెంచ్‌కే పరిమితం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. పరాగ్‌ ఈ సీజన్‌లో చాలా దారుణమైన ప్రదర్శరన కనబరుస్తున్నాడు.తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవడంలో రియాన్‌ పరాగ్ చాలా దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతడిని జట్టు మేనెజ్‌మెంట్‌ తీసి పక్కన పెట్టింది. ఇంకా అదే విధంగా యువ ఆటగాడు దృవ్‌ జురల్‌ను రాజస్తాన్‌ కొనసాగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆర్సీబీ టీంతో జరిగిన మ్యాచ్‌లో జురల్‌ (42) చాలా బాగా ఆకట్టుకున్నాడు.మొత్తానికి ఓవర్ యాక్షన్ చేసే రియాన్ పరాగ్ కి రాజస్థాన్ టీం మ్యానేజ్మెంట్ గట్టి షాక్ ఇచ్చింది. ఈ దెబ్బతో మనోడు ఓవర్ యాక్షన్ ఆపి బుద్ధి తెచ్చుకోని మ్యాచ్ లు సరిగ్గా ఆడాలని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: