మ్యాచ్ కి ముందు.. ఆర్సిబికి అదిరిపోయే గుడ్ న్యూస్?

praveen
ప్రతి సీజన్లో లాగానే ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో కూడా భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. పడుతూ లేస్తూనే ప్రయాణాలు సాగిస్తుంది అని చెప్పాలి. ఒక మ్యాచ్లో ఘన విజయాన్ని సాధించింది.. ఇక తిరుగులేదు అనుకునే లోపే.. తర్వాత మ్యాచ్ లో ఓడిపోతుంది అని చెప్పాలి. అయితేగత సీజన్లతో పోల్చి చూస్తే మాత్రం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రత్యర్థులకు గడ్డి పోటీ ఇస్తూ ప్రస్తుతం ఎంతో పటిష్టంగా కనిపిస్తూ ఉంది.

 అయితే ఇప్పటికే ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్లో వరుసగా రెండు విజయాలు సాధించి జోరు చూపిస్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు.. ఇటీవలే ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది అని చెప్పాలి. ఏకంగా గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఫేసర్ హేజిల్ వుడ్ ఫిట్నెస్ సాధించాడు అన్నది తెలుస్తుంది. హేజిల్ వుడ్ 100% ఫిట్నెస్ సాధించాడు అన్న విషయాన్ని ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఇక ఈ స్టార్ ఫాస్ట్ బౌలర్ రాకతో అటు బెంగళూరు జట్టు బౌలింగ్ విభాగం మరింత పటిష్టంగా మారుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 ఇప్పటికే మహమ్మద్ సిరాజ్, హసరంగ, హర్షల్ పటేళ్ లు అద్భుతంగా రాణిస్తూ ఉన్నారు. కీలకమైన సమయంలో వికెట్లు పడగొడుతూ జట్టు విజయంలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. ఇక వీరికి తోడు ప్రస్తుతం హెజిల్ వుడ్ చేరాడు అంటే చాలు.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు తిరుగు ఉండదు అని చెప్పాలి. అయితే నలుగురు విదేశీ ఆటగాళ్ల కోటాలో డూప్లెసిస్, మాక్స్వెల్, హసరంగా, హేజిల్ వుడ్ లకు ఇక బెంగళూరు  తుదిజట్టులో ఛాన్స్ దొరికే అవకాశం ఉంది అని తెలుస్తుంది. కాగా ఏడు మ్యాచ్లలో నాలుగు విజయాలు సాధించి పాయింట్లు పట్టికలో ఐదవ స్థానంలో కొనసాగుతుంది బెంగళూరు టీం. నేడు కోల్కతాతో మ్యాచ్ ఆడబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: