వైరల్ : అర్జున్ టెండూల్కర్.. ఐపీఎల్ లో మొదటి సిక్సర్?

praveen
క్రికెట్ లెజెండ్ భారత క్రికెట్లో క్రికెట్ దేవుడిగా అభిమానులు అందరూ పిలుచుకునే సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇక ఎట్టకేలకు ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఎన్నో రోజుల నుంచి ఐపీఎల్ లో ఎంట్రీ కోసం నిరీక్షణగా ఎదురు చూస్తున్న అర్జున్ టెండూల్కర్ కి ఇటీవలే ముంబై ఇండియన్స్ తుది జట్టులో ఛాన్స్ దక్కింది. ఇక వరుసగా అవకాశాలు అందుకుంటూ అదరగొడుతున్నాడు. అయితే ఇలా తుది జట్టులోకి వచ్చిన తర్వాత అర్జున్ టెండూల్కర్ ఏం చేసినా కూడా అది పెద్ద న్యూస్ గా మారిపోతోంది. మొన్నటికి మొన్న ఐపీఎల్ లో అర్జున్ మొదటి వికెట్ తీసిన సమయంలో అందరూ దాని గురించే చర్చించుకున్నారు.

 ఇక ఆ తర్వాత మ్యాచ్లో అర్జున్ ఎక్కువ పరుగులు ఇవ్వడంతో అలా కూడా వార్తల్లో నిలిచాడు అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఒక సిక్స్ కొట్టడం ద్వారా అర్జున్ టెండూల్కర్ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఇటీవలే ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఐపీఎల్ లో తొలి సిక్సర్ కొట్టాడు అని చెప్పాలి. గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇన్నింగ్స్ సమయంలో తొమ్మిదో నెంబర్ ఆటగాడిగా క్రీజు లోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ మోహిత్ శర్మ బౌలింగ్ లో భారీ సిక్సర్ కొట్టాడు. మోహిత్ శర్మ షార్ట్ బాల్ వేయగా అర్జున్ డీప్ స్క్వేర్ దిశగా సిక్సర్ కొట్టడం హైలైట్ గా నిలిచింది అని చెప్పాలి.

 ఇక అర్జున్ టెండూల్కర్ కు ఐపీఎల్ లో ఇదే తొలి సిక్సర్ కావడం గమనార్హం. అదే సమయంలో తొలి ఐపిఎల్ సీజన్ కూడా. ఇక బౌలర్గా మంచి ప్రదర్శన కనబరిచిన అర్జున్ టెండూల్కర్ ఇప్పుడు బ్యాటింగ్ లోను సిక్సర్ తో అలరించడంతో సచిన్ ఫ్యాన్స్ అందరూ కూడా పండగ చేసుకుంటున్నారు అని చెప్పాలి. అర్జున్ టెండూల్కర్ కి బ్యాటింగ్లో ప్రమోషన్ ఇవ్వాలని అతనికి మంచి టాలెంట్ ఉందని.. నిరూపించుకునేందుకు ఛాన్స్ వస్తే చాలు.. అంటూ ఎంతో మంది సచిన్ టెండూల్కర్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: