GT vs MI: కాసేపట్లో ఛాంపియన్స్ మధ్య సమరం?

Purushottham Vinay
ఐపీఎల్ 2023 సీజన్లో  భాగంగా మరో ఆసక్తికర మ్యాచ్ కి రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఢిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌ టీంతో ఏకంగా ఐదు సార్లు కప్పును ముద్దాడిన ముంబై ఇండియన్స్‌ టీం తలపడనుంది.ఈ సీజన్‌లో రెండు జట్లు చెరో ఆరు మ్యాచులను ఆడాయి. అందులో నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్ పాయింట్ల పట్టికలో ఇప్పుడు నాలుగో స్థానంలో కొనసాగుతుండగా మూడు మ్యాచుల్లో గెలుపొందిన ముంబై ఇప్పుడు ఏడో స్థానంలో ఉంది.  ఈ నేపథ్యంలో కాసేపట్లో జరగనున్న పోరు చాలా హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది.స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకోవడం గుజరాత్ టీం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఓపెనర్లు వృద్ధిమాన్ సాహా ఇంకా శుభ్‌మన్ గిల్‌లతో కెప్టెన్ హార్ధిక్ పాండ్య మంచి ఫామ్‌లో ఉన్నారు.వీరితో పాటు విజయ్ శంకర్‌, డేవిడ్ మిల్లర్‌ ఇంకా రాహుల్ తెవాటియాలు బ్యాటింగ్‌లో రాణిస్తే ఖచ్చితంగా భారీ స్కోరు సాధించవచ్చు. గుజరాత్ బౌలింగ్ విభాగం చాలా బలంగా ఉంది. మహ్మద్ షమీ ఇంకా మోహిత్ శర్మలు లక్నోతో మ్యాచ్‌లో ఓడిపోతుందనుకున్న సమయంలో చాలా చేశారు. ఈ ఇద్దరితో పాటు రషీద్ ఖాన్‌, నూర్ అహ్మద్‌ ఇంకా జయంత్ యాదవ్‌లు కూడా రాణిస్తే ముంబై కి ఖచ్చితంగా కష్టాలు తప్పకపోవచ్చు.


ఢిపెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ సీజన్‌లో అడుగుపెట్టిన గుజరాత్ టీం ఇక నేటి మ్యాచ్‌లో విజయం సాధించి తన స్థానాన్ని మెరుగుపరచుకోవాలని చూస్తోంది.వరుస ఓటములతో ఈ సీజన్‌ను ప్రారంభించిన ముంబై టీం ఇప్పుడిప్పుడే గెలుపు బాటపడుతోంది. పంజాబ్‌ టీంతో మ్యాచ్‌లో 215 పరుగుల లక్ష్యాన్ని దాదాపుగా చేజింగ్ చేసినంత పని కూడా చేసింది.ముంబై కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సూర్యకుమార్ యాదవ్‌ ఇంకా కామెరూన్ గ్రీన్‌లు ఫామ్ అందుకోవడం మంచి విషయం. వీరిలో ఏ ఇద్దరు నిలబడినా కూడా ముంబై అవలీలగా భారీ స్కోరు సాధిస్తుంది. అయితే.. బౌలింగ్ మాత్రం ముంబైని ఇబ్బందిపెడుతుంది.ఇక జోఫ్రా ఆర్చర్ కోలుకుని వచ్చినా.. మునపటి వాడిని కొనసాగించలేకపోతున్నాడు. పీయూష్ చావ్లా ఒక్కడే మంచిగా రాణిస్తున్నాడు. మిగిలిన వారు కూడా బాగా రాణించాలని ముంబై మేనేజ్‌మెంట్ ఆశపడుతుంది.ఇక నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ అనేది సమతుల్యంగా ఉంది. మొదట్లో ఈ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు బాగా అనుకూలంగా ఉండొచ్చు. 175 పరుగుల కంటే ఎక్కువ స్కోరు సాధించిన టీంకి ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: