మ్యాచ్ గెలిచినా.. వార్నర్ కు ఆ బాధ తప్పలేదు?

praveen
ప్రతి ఐపీఎల్ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తూ అదరగొడుతూ ఉంటుంది ఢిల్లీ క్యాపిటల్ జట్టు. కానీ ఈ ఏడాది మాత్రం మునుపేన్నడు లేని విధంగా పేలవ అవ్వ ప్రదర్శన చేసింది అన్న విషయం తెలిసిందే. వరుసగా 5 పరాజయాలు చవిచూసింది. అయితే ఇలా ఐదు ఓటముల తర్వాత ఎట్టకేలకు ఒక విజయాన్ని నమోదు చేసింది అని చెప్పాలి. ఇక కోల్కతా పై మొదటి విజయాన్ని అందుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఇక ఇటీవల సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా గెలిచి రెండోసారి ఘన విజయాన్ని అందుకుంది.


  వార్నర్ కెప్టెన్సీలో బదిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే ఇప్పటికే ఐదు మ్యాచ్లలో పరాజయాలా పాలు అయిన నేపథ్యంలో ఇక ఏడాది ఐపీఎల్ లో ఢిల్లీ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు ఉంటాయా లేదా అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. ప్లే ఆఫ్ గురించి పక్కన పెడితే అటు వరుస ఓటమిలో చవిచూసిన జట్టు వరుసగా రెండు విజయాలు సాధించడంతో ఫాన్స్ తో పాటు జట్టులోని ఆటగాళ్లు అందరు కూడా సంతోషం వ్యక్తం చేశారు అని చెప్పాలి.

 అయితే అటు డేవిడ్ వార్నర్ కి మాత్రం మ్యాచ్ గెలిచాము అన్న ఆనందమే లేకుండా పోయింది అని చెప్పాలి. ఎందుకంటే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 7 పరుగులు తేడాతో విజయం సాధించిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్ వార్నర్ కు ఊహించని షాక్ తగిలింది. ఈ మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మైంటైన్ చేసినందుకు గాను వార్నర్ కి 12 లక్షల జరిమానా విధిస్తున్నట్లు ఐపీల్ నిర్వాహకులు తెలిపారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్టును ఉల్లంఘించినందుకు గాను వార్నర్ జరిమానా తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ సీజన్లో వార్నర్ కంటే ముందు డూప్లెసిస్,  సంజు శాంసన్, సూర్య కుమార్ యాదవ్, హార్థిక్ పాండ్యా, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ లు కూడా అటు స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: