హమ్మయ్యా.. హైదరాబాద్ ఓడినా.. అతను ఫామ్ లోకి వచ్చాడు?

praveen
ఐపీఎల్ 2023 సీజన్ లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ మరియు సన్ రైజర్స్ మధ్య మంచి రసవత్తర పోరు కొనసాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగిన ఢిల్లీ కి మొట్ట మొదటి సారి ఫామ్ లోకి వచ్చి చుక్కలు చూపించాడు వాషింగ్టన్ సుందర్. ఇప్పటికి సన్ రైజర్స్ ఆడిన ఆరు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన వాషింగ్టన్ సుందర్ ఈ ఒక్క మ్యాచులోనే ఒక ఓవర్ లో మూడు వికెట్స్ తీసి కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చి ఢిల్లీ నడ్డి విరిచాడు. చాల రోజులుగా వాషింగ్టన్ సుందర్ నుంచి మంచి ప్రదర్శన కోసం సన్ రైజర్స్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన చూపులకు ఇప్పుడు ఢిల్లీ తో జరిగిన మ్యాచులో ఫలితం కనిపించింది.

ఎవ్వరు ఊహించని విధంగా వాషింగ్టన్ ఫామ్ లోకి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం వాషింగ్టన్ సుందరి వేసిన ఓవర్ యొక్క వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా వైరల్ అవుతుండటం తో పాటు అతడి పేరు సైతం సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో లిస్ట్ ఉండటం విశేషం.

 ఇక ఇలాగే భువనేశ్వర్ వంటి స్టార్ ఫేసర్ కి వాషింగ్టన్ సుందర్ లాంటి బౌలర్ జత కలిసి ఆడితే రానున్న మ్యాచుల్లో అద్భుతాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. ఇక ఢిల్లీ టీమ్ కి కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వార్నర్ చాల రోజుల పాటు సన్ రైజర్స్ టీమ్ కోసం ఆడటం విశేషం. ఇప్పటికి మొదటి సారి తన స్థాయికి తగ్గ ప్రదర్శనతో వాషింగ్టన్ సుందరు అందరిని అలరించాడు. ప్రస్తుతానికి సుందర్ ప్రదర్శన వల్ల ఇన్నాళ్లపాటు అతడిపై ఉన్న ఒక అపవాదు పోయినట్టు అయ్యింది. ఇలాగే ప్రతి ఒక ఆటగాడు బాగా ఆది ఈ సారి అయినా పాయింట్స్ పట్టికలో హైదరాబాద్ జట్టు పేరును పై స్థానంలో ఉంచుతారని ఆశిద్దాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: