భువి కాళ్లకు దండం పెట్టిన వార్నర్.. కారణం ఏంటి?

praveen
?
క్రికెట్ లో ఎలాంటి సంఘటనలు అయినా కూడా జరగవచ్చు అని మరోమారు రుజువు అయ్యింది. అయితే ఈ సారి కాస్త సరదా సంఘటన చోటు చేసుకోవడం తో అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే హైదరాబాద్ సన్రైజర్స్ టీమ్ లో చాల ఏళ్లుగా వార్నర్ మరియు భువనేశ్వర్ కుమార్ కలిసి ఆడుతున్నారు. దాంతో వీరిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేది. అయితే ఈ సారి వార్నర్ ని ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేయడం తో ఆ జట్టు తరపున ఐపీఎల్ 2023 సీజన్ లో ఆడుతున్నాడు.

ఇక ఢిల్లీ కి సన్ రైజర్స్ కి మధ్య ఒక మ్యాచ్ జరుగుతున్న నేపధ్యం లో ఈ మ్యాచ్ ఉప్పల్ వేదికగా ఉండబోతుంది. మ్యాచుకు ముందు ఇరు జట్లు ప్రాక్టీస్ సెషన్స్ లో కూడా పాల్గొంటుండగా ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఢిల్లీ క్యాపిటల్స్ కి కెప్టెన్ గా ఉన్న వార్నర్ సన్ రైజర్స్ టీమ్ కి స్టార్ ఫేసర్ గా భువనేశ్వర్ ఎదురు పడగానే వెంటనే పరిగెత్తుకుని వెళ్లి భువి పాదాలను తాకాడు వార్నర్.

షాక్ కి గురైన భువి వెంటనే వార్నర్ ని లేపి ఆలింగనం చేసుకొని తమ స్నేహ బంధం ఎంత గాఢమైనదో అందరికి తెలిసేలా చేసాడు. మన దేశపు సంప్రదాయాలు, పద్దతులను వార్నర్ ఇంతగా పాటిస్తుండటం పట్ల సోషల్ మీడియాలో నెటిజన్స్ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేశం ఏడైన ఆట కోసం ఇద్దరు ఆటగాళ్లు కలిసిన తీరును కూడా మెచ్చుకుంటున్నారు. ఇక ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచులో ఢిల్లీ కేవలం 144 పరుగులు మాత్రమే సాధించగా, 20  ఒవర్స్ లో తొమ్మిది వికెట్స్ ని కోల్పోయింది. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బౌలింగ్ చేసి మూడు వికెట్స్ తీయగా, భువి రెండు వికెట్స్ ని పడగొట్టాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ కి దిగింది ఢిల్లీ క్యాపిటల్స్.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: