ఈ ఐపీఎల్ లో రెచ్చిపోతున్న రహానే?

Purushottham Vinay
ఈ ఐపీఎల్ సీజన్ లో చెలరేగిపోతున్న చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అజింక్య రహానేపై క్రికెట్ ప్రేక్షకులు ఎన్నో ప్రశంసలు కురిపిస్తున్నారు. తన బ్యాటింగ్ తో సూపర్ ఇన్నింగ్స్ ఆడిన అతడిని అతని ఫ్యాన్స్ ఎంతగానో పొగిడేస్తున్నారు.అసలు రహనే ఎక్కడున్నాడో తెలియని స్థాయి నుంచి మెరుపు ఇన్నింగ్స్ తో మళ్లీ వెలుగులోకి దూసుకొచ్చి అదరగోడుతున్నాడు. అతడిని ఖచ్చితంగా టీమిండియాకు ఎంపిక చేయాలన్న వాదనలు ఎక్కువగా విన్పిస్తున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్ కు రిషబ్ పంత్ స్థానంలో అజింక్య రహానేను ఎంపిక చేయాలని అభిమానులు కోరుతున్నారు.కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఆదివారం నాడు జరిగిన మ్యాచ్ లో అజింక్య రహానే శివమెత్తాడు. కేవలం 29 బంతుల్లో ఏకంగా 71 పరుగులతో సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. తాజా ఐపీఎల్ (IPL 2023) లో ఇప్పటి దాకా 5 మ్యాచ్ లు ఆడిన రహానే ఏకంగా 199 స్ట్రైక్ రేట్ తో 209 పరుగులు సాధించి సత్తా చాటాడు. ఈ ఐపీఎల్ సీజన్ లోనే అతడు అత్యధిక స్ట్రైక్ రేట్ నమోదు చేయడం నిజంగా విశేషం. తర్వాతి మ్యాచ్ ల్లోనూ ఇదే హవా కొనసాగిస్తే అజింక్య రహానే ఖచ్చితంగా అత్యుత్తమ గణాంకాలు నమోదు చేయడం ఖాయమని క్రికెట్ అభిమానులు అంచనా వేస్తున్నారు.


కేకేఆర్(KKR) టీంతో జరిగిన మ్యాచ్ లో రప్ఫాడించిన అజింక్య రహానేపై సోషల్ మీడియాలో ఎంతగానో ప్రశంసల వర్షం కురుస్తోంది.అజింక్య రహనే  విజృంభన చూసి అతడిని 2.o వెర్షన్ గా ఫ్యాన్స్ అభివర్ణిస్తున్నారు. ఏబీడీ, బట్లర్ ఇంకా వార్నర్ ను మిక్స్ చేస్తే అది.. రహానే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇంకా ఇదే సమయంలో పలువురు ఆటగాళ్లపై సెటైర్లు కూడా వేస్తున్నారు. ఐపీఎల్ వేలంలో రూ.3.8 కోట్ల భారీ ధరకు పలికిన రియాన్ పరాగ్ దారుణంగా విఫలమయ్యాడని.. ఇంకా కేవలం రూ.50 లక్షలు పెట్టి కొన్న రహానే మాత్రం చాలా సూపర్ గా చెలరేగిపోతున్నాడని అభిమానులు అంటున్నారు.అయితే తన నుంచి ఇలా అత్యుత్తమ ఇన్నింగ్స్ ఇంకా రాలేదని రహానే అన్నాడు. ఎంఎస్ ధోని లాంటి ప్లేయర్ నాయకత్వంలో ఆడాలని ప్రతి క్రికెటర్ కోరుకుంటారని, అతడి కెప్టెన్సీలో తాను చాలా మెరుగయ్యానని రహానే వినమ్రంగా చెప్పాడు. ఎవరు ఏమీ చెప్పినా ధోని చాలా ఓపిగ్గా వింటాడని వెల్లడించాడు. కేకేఆర్ టీంతో జరిగిన మ్యాచ్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తో పాటు మరో నాలుగు అవార్డులని కూడా రహానే సొంతం చేసుకున్నాడు. తర్వాతి మ్యాచ్ ల్లో ఇదే జోరు కొనసాగించాలని సీఎస్కే అభిమానులు ఎంతగానో కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: