ధోని లేకపోతే.. చెన్నై జట్టు ఉత్తిదే : ఇయాన్ మోర్గాన్

praveen
ప్రస్తుతం ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీ లో ఛాంపియన్ టీం గా, ఎక్కువ పాపులారిటీ కలిగిన జట్టుగా కూడా కొనసాగుతూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్. అయితే చెన్నై జట్టుకు ఇంత పాపులారిటీ వచ్చింది. దానికి కారణం ఏంటి అంటే ఆ టీమ్ సాధించిన టైటిల్స్ కాదు.. కేవలం మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. ధోని ఉన్నాడు అనే ఎంతో మంది అభిమానులు ఇప్పటికి చెన్నై సూపర్ కింగ్స్ కి మద్దతు ప్రకటిస్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే 2019లో అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ కి రిటైర్మెంట్ ప్రకటించాక.. మహేంద్ర సింగ్ ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.

 కాగా 2020, 21 సీజన్లో పెద్దగా మహేంద్ర సింగ్ ధోని మెరుపులు మెరిపించలేదు. అయితే 2023 సీజన్లో భారీ స్కోరు చేయకపోయినప్పటికీ ఉన్నంత సేపు బౌండరీలతో చెలరేగిపోతున్నాడు మహేంద్ర సింగ్ ధోని. అయితే ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక ఇది నా క్రికెట్ కెరియర్ లో లాస్ట్ పేజ్ అంటూ సన్రైజర్స్ మ్యాచ్ అనంతరం కూడా ధోని వ్యాఖ్యానించాడు. ఈ క్రమంలోనే ఇటీవల ధోని రిటైర్మెంట్ గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు అని చెప్పాలి. ధోని ప్రతి గేమ్ లో లీనం అయ్యే విధానం అసాధారణంగా ఉంటుంది.

 మ్యాచ్ పూర్తయిన తర్వాత కుర్రాళ్లతో అనుభవం పంచుకునే విధానం చూస్తుంటే ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది. ఎన్నో ఏళ్లుగా క్రికెట్లో తాను నేర్చుకున్న అనుభవాన్ని మొత్తం కుర్రాళ్లకు పంచాలి అనే తపన ఎప్పుడూ ధోనిలో కనిపిస్తూ ఉంటుంది. మహేంద్ర సింగ్ ధోనీ లాంటి కెప్టెన్ టీంలో ఆడటం ఎవరికైనా అదృష్టమే. ధోని రిటైర్ అయ్యాక అతను లేని లోటు తప్పకుండా తెలుస్తుంది. ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేయడం ఎవరి వల్ల కాదు. అయితే చెన్నై జట్టు ఆడే ప్రతి మ్యాచ్ లో మహీ ప్రభావం కనిపిస్తుంది. మరి ధోని లేకుండా సీఎస్కే ఎలా ఆడుతుందో చూడాలి.. చపాక్ స్టేడియంలో ధోని ఆడకపోతే చెన్నై టీం కి సపోర్ట్ దక్కుతుందా అంటే అది కూడా చెప్పలేం అంటూ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: