ఏంటయ్యా అర్జున్ ఇది.. ఇలా బౌలింగ్ చేస్తే మళ్ళీ చాన్స్ వస్తుందా?

praveen
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ఇటీవలే ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు అన్న విషయం తెలిసిందే. దాదాపు గత రెండు మూడేళ్ల నుంచి కూడా ఐపీఎల్ లో ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న అర్జున్ టెండూల్కర్.. కేవలం బెంచ్ కి మాత్రమే పరిమితం అయ్యాడు. కానీ ఎట్టకేలకు 2023 సీజన్లో అర్జున్ టెండూల్కర్ తన ప్రతిభ ఏంటో నిరూపించుకునే అవకాశం దొరికింది. వచ్చిన అవకాశాన్ని ఎంతో అద్భుతంగా సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పాలి. రెండు మ్యాచ్లలో కూడా మంచి ప్రదర్శన చేశాడు.

 అయితే కేవలం పవర్ ప్లే లో మాత్రమే కాకుండా డెత్ ఓవర్లలో కూడా అర్జున్ టెండూల్కర్ తన బౌలింగ్ తో పరుగులు కట్టడి చేసిన తీరు చూసి అటు సచిన్ టెండూల్కర్ అభిమానులు అందరూ కూడా ఎంతగానో ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. అర్జున్ గొప్ప క్రికెటర్ గా ఎదగాలని ఆకాంక్షించారు. అయితే ఇటీవల పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో మాత్రం సచిన్ తనయుడు అర్జున్ దారుణమైన ప్రదర్శనతో అభిమానులందరికి కూడా షాక్ ఇచ్చాడు. పరుగులు కట్టడి చేయాల్సింది పోయి దారాలంగా పరుగులు సమర్పించుకున్నాడు.

 ఇటీవలే పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్లో ఎక్కువ పరుగులు ఇచ్చి చెత్త రికార్డును కూడా మూటగట్టుకున్నాడు. మూడు ఓవర్లు వేసిన అర్జున్ 48 పరుగులు ఇచ్చి కేవలం ఒకే ఒక వికెట్ మాత్రమే తీశాడు. తొలి రెండు ఓవర్లు బాగానే బౌలింగ్ చేసిన అర్జున్.. తాను వేసిన మూడో ఓవర్లో ఏకంగా 31 పరుగులు సమర్పించుకున్నాడు. ఇక  ఇన్నింగ్స్ 16 ఓవర్లో అర్జున్ వైడ్ నోబాల్ సహా 6, 4, 4, 6, 4, 4 1 పరుగులు ఇచ్చాడు. దీంతో అర్జున్ టెండూల్కర్ ను టార్గెట్ చేస్తూ ముంబైఇండియన్ ఫాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ముంబై తరఫున అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్గా అర్జున్ చెత్త రికార్డు ఖాతాలో వేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: