సచిన్ ను ఔట్ చేసిన అర్జున్.. నిజం చెప్పేసిన లెజెండ్?

praveen
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా అటు లెజెండరీ క్రికెటర్ అయినా సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ గురించిన వార్తలే అటు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే మొన్నటి వరకు అటు ముంబై ఇండియన్స్ జట్టులో  ఒక ఆటగాడిగా ఉన్నప్పటికీ తుది జట్టులో మాత్రం చాన్స్ దక్కించుకోలేకపోయాడు అర్జున్ టెండూల్కర్. గత ఏడాది ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేసిన సమయంలో కూడా అతనికి తుది జట్టులో ఛాన్స్ దక్కలేదు. కానీ ఇక ఏడాది ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున అరంగేట్రం చేశాడు అని చెప్పాలి.

 అరంగేట్రం చేయడమే కాదు మంచి ప్రదర్శన చేసి ఆకట్టుకుంటున్నాడు అర్జున్ టెండూల్కర్. డెత్ ఓవర్లలో సైతం బౌలింగ్ చేస్తూ ఇక పరుగులను కట్టడి చేస్తూ తన బౌలింతో ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడా అర్జున్ ప్రదర్శన గురించి మాట్లాడుకుంటున్నారు. ఇక సచిన్ కు సైతం ఎక్కడికి వెళ్లినా అర్జున్ గురించే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఇక మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే.

 ఇక అప్పుడప్పుడు అభిమానులతో చిట్ చాట్ నిర్వహిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఆస్క్ సచిన్ పేరుతో సోషల్ మీడియాలో అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యాడు సచిన్. ఇందులో ఒక నేటిజన్ సర్ మీకు అత్యంత ఇష్టమైన సెంచరీ ఏది అని అడగగా.. పెర్త్ లో 1992లో టెస్టులో చేసిన 114 రన్స్ తన ఫేవరెట్ సెంచరీ అంటూ చెప్పుకొచ్చాడు. మీరు అర్జున్ బౌలింగ్ లో ఎప్పుడైనా అవుట్ అయ్యారా అంటూ ప్రశ్నించగా.. అవును ఒకసారి లార్డ్స్ లో అవుట్ అయ్యాను.. ఇది అర్జున్ కి గుర్తు చేయొద్దు అంటూ నవ్వులు పూయించాడు సచిన్ టెండూల్కర్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: