ఆ క్షణం.. నేను చాలా బాధపడ్డాను : సచిన్

praveen
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ భారత క్రికెట్లో చేసిన సేవలు గురించి ఎంత చెప్పినా తక్కువే. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన సచిన్ టెండూల్కర్ అసాధారణమైన ప్రతిభతో ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఇక భారత క్రికెట్ ప్రేక్షకులు అందరికీ కూడా ఆయన క్రికెట్ దేవుడిగా మారిపోయారు అని చెప్పాలి. ఇక క్రికెట్ నే ఫ్యాషన్ గా మార్చుకొని అంతర్జాతీయ క్రికెట్లో రాణించాలనుకునే ఎంతోమంది యువకులకి సచిన్ ఇప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తూనే ఉన్నారు.

 అంతర్జాతీయ క్రికెట్లో ఏ ఇతర ఆటగాడికి సాధ్యం కానీ ఎన్నో అరుదైన రికార్డులను సృష్టించారు సచిన్. ఆయన రిటైర్మెంట్ ప్రకటించి ఏళ్లు గడుస్తున్న ఆయన సాధించిన రికార్డులు మాత్రం ఇప్పటికీ ఎంతో పదిలంగానే ఉన్నాయి అని చెప్పాలి. నేటి జనరేషన్ ఆటగాళ్లలో ఎవరు కూడా సచిన్ రికార్డులకు చేరువలో కూడా లేరు అని చెప్పాలి.  ఇకపోతే అటు అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎప్పుడు అభిమానులకు దగ్గరగానే ఉంటున్నారు మాస్టర్ బ్లాస్టర్. తన కెరీర్ కు సంబంధించి ఎన్నో ఆసక్తికర విషయాలను ఎప్పుడూ అభిమానులతో పంచుకుంటూ ఉంటారూ అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మొదటి సెంచరీ చేసినప్పుడు ఎదుర్కున్న పరిస్థితులను ఇటీవల గుర్తు చేసుకున్నారు.

 తాను మొదటి సెంచరీ చేసినప్పుడు జరిగిన ఒక ఘటనతో ఎంతగానో బాధపడ్డాను అంటూ చెప్పుకొచ్చాడు. నేను పాఠశాల క్రికెట్లో మొదటి సెంచరీ చేసినప్పుడు నా ఫోటో లేకుండానే వార్తలను కవర్ చేశారు.  అప్పుడు నేను, నా కుటుంబం ఎంతగానో బాధపడ్డాం. ప్రశంసలు ప్రదర్శనను పెంపొందిస్తాయి అన్న విషయాన్ని మాత్రం నేను ఎప్పుడూ నమ్ముతాను. ఎందుకంటే ప్రశంసలు లేకపోతే ఏ అథ్లెట్ అయినా సరే బయటకు వెళ్లి తమ భావాలను వ్యక్తీకరించలేడు అంటూ సచిన్ టెండూల్కర్ చెప్పకొచ్చాడు. ఇక ఇప్పుడు సచిన్ వారసుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ లో రాణించడానికి సిద్ధమయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: