చెన్నై జట్టుకు.. ప్రత్యర్తిగా ఆడటం ఎంతో ఇష్టం : కోహ్లీ

praveen
ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ హడావిడి కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఇక ప్రతి మ్యాచ్ ని కూడా మిస్ కాకుండా వీక్షిస్తున్న ప్రేక్షకులు అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ పొందుతూ ఉన్నారు. ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత అటు క్రికెట్ లవర్స్ అందరికీ కూడా పండగ వాతావరణం నెలకొంది అని చెప్పాలి. ఇక ఉత్కంఠ భరితంగా సాగుతున్న మ్యాచులు ప్రేక్షకులు ఊహించిన దానికంటే ఎక్కువగా క్రికెట్ మజాను పంచుతున్నాయి.

 కాగా సాదరణంగా ఒకప్పుడు ఐపీఎల్ ని చూడాలి అంటే ఏదో ఒక ఆన్లైన్ స్ట్రీమింగ్ యాప్ ని సబ్ స్క్రిప్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ ఇక ఈ ఏడాది మాత్రం అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే జియో సినిమా ఐపీఎల్ ను ఉచితంగా ప్రసారం చేస్తుంది. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఉచితంగానే ఐపిఎల్ మ్యాచ్లను వీక్షిస్తున్నారు. అదే సమయంలో అన్ని జట్ల ఆటగాళ్లతో చిట్ చాట్ నిర్వహించి.. ఎన్నో ఆసక్తికర విషయాలను కూడా అభిమానులకు తెలిసేలా చేస్తూ ఉంది జియో సినిమా. ఇకపోతే ఇటీవలే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీతో జియో సినిమా చిట్ చాట్ నిర్వహించింది.

 ఈ క్రమంలోనే ఐపీఎల్ లో ఆడుతున్న ఎంతోమంది ప్లేయర్ల గురించి విరాట్ కోహ్లీ తన అభిప్రాయాలను పంచుకున్నాడు అని చెప్పాలి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ హిస్టరీలో మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఎవరు అని అడగగా అంబటి రాయుడు పేరు చెప్పాడు విరాట్ కోహ్లీ. ఇక ఐపీఎల్ లో గ్రేటెస్ట్ ఆల్రౌండర్ ఎవరు అని ప్రశ్నిస్తే షేన్ వాట్సన్ అని పేరు చెప్పాడు. సునీల్ నరైన్ కంటే రషీద్ ఖాన్ బెటర్ స్పిన్నర్ అంటూ చెప్పుకొచ్చాడు. ఐపీఎల్ హిస్టరీ లో ఎవరికి సాధ్యం కాని రీతిలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ప్రత్యర్థిగా ఆడటం అంటే తనకు ఎంతగానో ఇష్టం అంటూ విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: