IPL 2023: కెప్టెన్లకి తలనొప్పిగా మారిన స్లో ఓవర్ రేట్?

Purushottham Vinay
మంచి ఉత్కంఠ పోరులో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయం సాధించింది.లక్నో టీం నిర్దేశించిన 155 పరుగుల ఛేదనలో రాజస్థాన్ ఏకంగా 6 వికెట్ల నష్టానికి కేవలం 144 పరుగులకే పరిమితమైంది. దీంతో 10 పరుగుల తేడాతో లక్నో టీం గెలుపొందింది. అయితే.. మ్యాచ్ గెలిచామన్న ఆనందం లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ కు పాపం కొంతసేపైనా లేకుండా చేశారు.ఎందుకంటే స్లో ఓవర్ కారణంగా అతడికి జరిమానా ని విధించారు.సువాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో బుధవారం నాడు రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు నిర్దేశిత సమయంలో తన బౌలింగ్ కోటాను ఏమాత్రం పూర్తి చేయలేకపోయింది. ఈ సీజన్‌లో లక్నో జట్టు స్లో ఓవర్ రేట్ ను నమోదు చేయడం ఇదే ఫస్ట్ టైం. దీంతో ఆ జట్టు కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్‌కు మొత్తం రూ.12లక్షల జరిమానా విధించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు.ఈ సీజన్‌లో మ్యాచ్‌లు లాస్ట్ బంతి దాకా ఉత్కంఠభరితంగా సాగుతుండడంతో నిర్దేశిత సమయంలో మాత్రం మ్యాచ్ లు పూర్తి కావడం లేదు. ఓవర్ల మధ్యలో ఎవరికి బౌలింగ్ ఇవ్వాలి ఇంకా ఫీల్డింగ్‌ను ఎక్కడ సెట్ చేయాలన్న దానిపై ఆ జట్ల కెప్టెన్లు చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో స్లో ఓవర్ కారణంగా అనేక జరిమానాలను ఎదుర్కొంటున్నారు.


కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై స్లో ఓవర్ రేట్ వల్ల సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా పడింది.అలాగే గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, రాజస్థాన్‌ కెప్టెన్ సంజూ శాంసన్‌లకు కూడా స్లో ఓవర్ రేట్ వల్ల ఫైన్ పడింది. అలాగే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పాండ్యాకు జరిమానా పడగా, ఇంకా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ కు ఫైన్ పడింది.ఓ సీజన్‌లో ఫస్ట్ టైం స్లో ఓవర్ రేటు నమోదు అయితే ఆ జట్టు కెప్టెన్‌కు మొత్తం రూ.12లక్షల జరిమానా వేస్తారు. రెండో సారి ఇలాగే జరిగితే కెప్టెన్ మొత్తం రూ.24లక్షల జరిమానా జట్టులో మిగిలిన సభ్యులకు ఒక్కొక్కరికి మొత్తం రూ.6లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధిస్తారు. మూడో సారి కూడా సేమ్ సీన్ రిపీట్ అయితే.. కెప్టెన్‌కు ఏకంగా రూ.30లక్షల జరిమానాతో పాటు ఓ మ్యాచ్ ని ఆడకుండా నిషేదం విధిస్తారు. మిగిలిన సభ్యులకు మొత్తం రూ.12లక్షల ఫైన్ లేదా మ్యాచ్ ఫీజులో 50శాతం కోత పడుతుంది. ఇలా స్లో ఓవర్ రేటు కారణంగా కెప్టెన్స్ తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: