నేడు డబుల్ ధమాకా.. ఇక క్రికెట్ ఫ్యాన్స్ కు పండగే?

praveen
ప్రస్తుతం క్రికెట్ లవర్స్ అందరు కూడా ఐపీఎల్ అనే క్రికెట్ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు అని చెప్పాలి. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభమైంది. ఇక ప్రతి మ్యాచ్ కూడా ఎంత ఉత్కంఠ భరితంగా సాగుతూ అసలు సిసలైన ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంది అని చెప్పాలి. ప్రతి మ్యాచ్ కూడా నువ్వా నేనా అన్నట్లుగా సాగుతూ క్రికెట్ లవర్స్ ను  ఉర్రూతలూగిస్తుంది. అయితే ఐపీఎల్ ప్రారంభమైన తర్వాత క్రికెట్ ప్రేక్షకులందరికీ అటు శనివారం ఆదివారం అంటే తెగ ఇష్టపడిపోతూ ఉంటారు. ఎందుకంటే అప్పటి వరకు వారంలో ఐదు రోజులపాటు రోజుకి ఒక్క మ్యాచ్ మాత్రమే జరుగుతూ ఉంటుంది.

కానీ వీకెండ్ లో మాత్రం ఏకంగా డబుల్ ధమాకా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఏకంగా రెండు మ్యాచ్లు కూడా ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటాయి. అందుకే ఇక క్రికెట్ లవర్స్ అందరూ కూడా వీకెండ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇక ఇప్పుడు క్రికెట్ లవర్స్ అందరికీ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అందింది. వీకెండ్ కాకపోయినప్పటికీ నేడు డబుల్ ధమాకా ఉండబోతుంది. ఇక రెండు మ్యాచ్లలో ప్రేక్షకులు ఎంటర్టైన్మెంట్ పొందబోతున్నారు అని చెప్పాలి.

 మొహాలీ వేదికగా పంజాబ్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం అవుతుంది అని చెప్పాలి. అయితే ఈ మ్యాచ్ లో ఉత్కంఠను ఆస్వాదించిన కొన్ని నిమిషాలకే ఇక మళ్లీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. సాయంత్రం 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే హోమ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో ఖాతా తెరవాలని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు భావిస్తుంది. ఏది ఏమైనా ప్రేక్షకులకు మాత్రం డబుల్ ధమాకా ఉండ పోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: